News October 8, 2025
ఎన్నికలకు పకడ్బంది ఏర్పాట్లు: NZB CP

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు నిబంధనల మేరకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు నిజమాబాద్ CP సాయి చైతన్య తెలిపారు. బుధవారం కమిషనరేట్‌లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా నవంబర్ 11 వరకు ప్రక్రియ పూర్తి కానుందన్నారు.
Similar News
News October 9, 2025
NZB: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 11న సాయంత్రం 5 గంటల వరకు మొదటి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. 12న నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటు నామినేషన్లకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ప్రకటన,13న అప్పీళ్ల స్వీకరణ, 14న అప్పీళ్ల పరిష్కారం, 15న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, 3 గంటల తరువాత పోటీలోని అభ్యర్థుల జాబితా ప్రచురణ, 23న పోలింగ్ అన్నారు.
News October 9, 2025
ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం: NZB కలెక్టర్

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. జిల్లాకు సంబంధించి మొదటి విడతగా ఈ నెల 9న నిజామాబాద్, బోధన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 18 జడ్పిటిసిలు, 177 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
News October 8, 2025
NZB: బ్యాంకర్లు లక్ష్యాలు పూర్తి చేయాలి

ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లా కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం జరిగింది. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, ప్రగతి, వచ్చే సీజన్‌లో రైతాంగానికి అందిచాలన్నారు.