News October 8, 2025

పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

image

పత్తి పంటను కనీస మద్దతు ధర (MSP)కు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా అధికారులతో పత్తి కొనుగోలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 98,260 ఎకరాలలో పత్తి సాగు జరిగిందని, దీని ద్వారా సుమారు 11,79,000 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అక్టోబర్ తర్వాత పత్తి దిగుబడి ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

ప్రకాశం: మత్స్యకారుడి గొంతులో ఇరుక్కున్న బతికున్న చేప.. చివరికి

image

ప్రకాశం జిల్లాలో గురువారం వింత ఘటన చోటుచేసుకుంది. ఒంగోలుకు చెందిన ఓ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లాడు. అనంతరం చేపలు పట్టి బుట్టలో వేస్తుండగా ఓ చేప ఎగిరి అతని నోటిలో పడింది. తీసేలోపే అది కాస్తా గొంతులోకి వెళ్లింది. గమనించిన తోటి మత్స్యకారులు అతణ్ని వెంటనే ఒంగోలు GGHకు తరలించారు. ENT వైద్యులు HOD డాక్టర్ ప్రభాకర్ బృందం శస్త్రచికిత్స చేసి చాపను బయటకు తీశారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా ఉన్నారు.

News March 13, 2026

తెలుగు జాతి కీర్తి పతాక.. బూర్గుల

image

బూర్గుల రామకృష్ణరావు 1899 మార్చి 13న నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు కల్వకుర్తి దగ్గరలోని పడకల్‌లో జన్మించారు. HYD సంస్థానంలో ఉర్దూ ఆధిపత్యం రాజ్యమేలుతున్న రోజుల్లో తెలుగు భాషా గౌరవం కోసం నినదించిన ధీశాలి బూర్గుల. మాతృభాషలో విద్యాబోధన జరగాలని నిజాం ప్రభుత్వాన్ని ధైర్యంగా నిలదీసిన ఆయన, తెలుగువారి స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. తొలి ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్య విలువలను కాపాడారు. నేడు ఆయన జయంతి.

News March 13, 2026

హోటళ్లకు గ్యాస్ కష్టాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాణిజ్య గ్యాస్ కొరత కష్టాలు మొదలయ్యాయి. బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ ధర భారీగా పెరగడంతో పలుచోట్ల చిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ ఆన్‌లైన్ బుకింగ్‌లు కావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్ చేస్తే కట్ అవుతోందని, సాంకేతిక ఇబ్బందులతో కష్టాలు పడుతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. మరి మీకూ ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయా? కామెంట్ చేయండి..