News October 8, 2025

రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ: టీపీసీసీ చీఫ్

image

TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌కు ఎలాంటి అడ్డంకులు లేవని, షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. కోర్టులో తమ లాయర్లు బలమైన వాదనలు వినిపించారని, రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, కోర్టులోనూ కచ్చితంగా గెలుస్తామన్నారు. రాష్ట్రంలో 90% స్థానాలను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News October 9, 2025

భారత్‌తో విభేదాలు.. ట్రంప్‌కు US లా మేకర్స్ వార్నింగ్

image

భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో US కాంగ్రెస్‌కు చెందిన 19 మంది లా మేకర్స్ ట్రంప్‌కు లేఖ రాశారు. ఇండియాతో రిలేషన్స్ మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంతో సఖ్యత లేకపోవడం ప్రతికూలంగా మారుతుందని హెచ్చరించారు. భాగస్వామ్యాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు కృషి చేయాలని సూచించారు. భారత గూడ్స్‌పై 50% టారిఫ్స్ విధించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

News October 9, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 09, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు
✒ ఇష: రాత్రి 7.11 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.