News October 8, 2025

38 లక్షల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి: ASF కలెక్టర్

image

జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ కోసం అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీసీఐ, మార్కెటింగ్, రెవెన్యూ, వ్యవసాయ, జిన్నింగ్ మిల్లుల యజమానులతో పత్తి కొనుగోలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఈ సంవత్సరం 3 లక్షల 34 ఎకరాలలో పత్తిపంట సాగు చేశారు. 38 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందన్నారు.

Similar News

News March 12, 2026

IPL: RCBకి షాక్?

image

ఐపీఎల్-19వ సీజన్ ప్రారంభం కాకముందే డిఫెండింగ్ ఛాంపియన్ RCBకి భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆ జట్టు కీలక బౌలర్, గతేడాది RCB లీడ్ వికెట్ టేకర్ జోష్ హాజిల్‌వుడ్ ఈ సీజన్‌‌లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. గాయం కారణంగా ఇప్పటికే T20WCకి దూరమైన అతడి ఫుల్ రికవరీకి టైమ్ పట్టొచ్చని సమాచారం. ఇక లీగల్ ఇష్యూస్ కారణంగా ఆ జట్టు మరో బౌలర్ యశ్ దయాల్ పాల్గొనడంపైనా సందిగ్ధం నెలకొంది.

News March 12, 2026

కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి: MLA

image

కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కామారెడ్డి MLA వెంకటరమణారెడ్డి కోరారు. రాష్ట్ర రాజధానికి అతి తక్కువ దూరంలో జాతీయ రహదారి, రైల్వే స్టేషన్ అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ భూమిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తే కామారెడ్డి అభివృద్ధి చెందటమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చారు.

News March 12, 2026

MBNR: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ

image

మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఈనెల 28వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జడ్జి ప్రేమలత తెలిపారు. రాజీ పడే ప్రతి కేసులను రాజు ద్వారానే పరిష్కారం చేసుకోవాలని రాజీ మార్గమే రాజమార్గం అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1334 కేసులను గుర్తించామని, అందులో 32 కేసులను పరిష్కారం చేశామని తెలిపారు. సివిల్, కుటుంబం, యాక్సిడెంట్, ఫ్రీ లిటిగేషన్ వంటి కేసులను పరిష్కారం చేసుకోవచ్చన్నారు.