News October 8, 2025
ఎన్టీఆర్: ఎమ్మెల్యే అన్నదమ్ములదే సెటిల్మెంట్ల హవా..?

జిల్లాలోని ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే, అతని సోదరులు సెటిల్మెంట్లు, గంజాయి టూ ఇసుక దందాలు, కమీషన్లు, వాళ్ళు చెప్పిందే రియల్ ఎస్టేట్ ధర అన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వచ్చే రూ.కోట్ల ఆదాయాన్ని సోదరులు పంచుకోవడంతో పాటు ఇవి బయటకు రాకుండా ఉండేలా సొంత, ప్రత్యర్థి పార్టీ నేతలకు మామూళ్లు ఇస్తున్నారనే చర్చ నడుస్తోంది. ప్రతీ స్టేషన్ పంచాయితీ కూడా వీరి కనుసన్నల్లోనే జరుగుతుందట.
Similar News
News October 9, 2025
భూములిచ్చిన ఊళ్లలోనే రిటర్నబుల్ ప్లాట్లు: CM చంద్రబాబు

AP: అమరావతి అభివృద్ధితో పాటు రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాలని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ ఊళ్లో భూములిచ్చిన రైతులకు ఆ ఊళ్లోనే రిటర్నబుల్ ప్లాట్లను ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో 53వ CRDA అథారిటీ సమావేశంలో మొత్తంగా 18 అంశాలపై చర్చించారు. అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి CRDA అథారిటీ ఆమోదం తెలిపింది.
News October 9, 2025
భారత్‌తో విభేదాలు.. ట్రంప్‌కు US లా మేకర్స్ వార్నింగ్

భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో US కాంగ్రెస్‌కు చెందిన 19 మంది లా మేకర్స్ ట్రంప్‌కు లేఖ రాశారు. ఇండియాతో రిలేషన్స్ మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంతో సఖ్యత లేకపోవడం ప్రతికూలంగా మారుతుందని హెచ్చరించారు. భాగస్వామ్యాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు కృషి చేయాలని సూచించారు. భారత గూడ్స్‌పై 50% టారిఫ్స్ విధించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
News October 9, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 09, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు
✒ ఇష: రాత్రి 7.11 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.