News October 8, 2025

GWL: ‘పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం’

image

ప్రమాద బాధిత పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్స్ శ్రావణి మృతి చెందారు. దీంతో ఆమెకు చీప్ ఆఫీస్ వెల్ఫేర్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ నుంచి రూ. 5 లక్షలు బీమా మంజూరైంది. ఆ చెక్కును శ్రావణి తల్లిదండ్రులు ఇందిరమ్మ, ఈశ్వరయ్యకు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అందజేశారు.

Similar News

News October 9, 2025

భారత్‌తో విభేదాలు.. ట్రంప్‌కు US లా మేకర్స్ వార్నింగ్

image

భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో US కాంగ్రెస్‌కు చెందిన 19 మంది లా మేకర్స్ ట్రంప్‌కు లేఖ రాశారు. ఇండియాతో రిలేషన్స్ మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంతో సఖ్యత లేకపోవడం ప్రతికూలంగా మారుతుందని హెచ్చరించారు. భాగస్వామ్యాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు కృషి చేయాలని సూచించారు. భారత గూడ్స్‌పై 50% టారిఫ్స్ విధించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

News October 9, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 09, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు
✒ ఇష: రాత్రి 7.11 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 9, 2025

VKB: రేషన్ బియ్యాన్ని సకాలంలో సీఎంఎస్‌కు అందించాలి: అ. కలెక్టర్

image

రైస్ మిల్లర్లు రేషన్ బియ్యాన్ని సకాలంలో సీఎంఎస్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)కు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బుధవారం ఆదేశించారు. కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా రైస్ మిల్లర్లు బియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. సకాలంలో బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదనపు కలెక్టర్ సూచించారు.