News October 8, 2025

ధరూర్: ‘బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి’

image

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని గద్వాల జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం ధరూర్ మండలంలో పర్యటించి బడి మానేసి పొలాల్లో పని చేస్తున్న వారిని గుర్తించే చర్యలు చేపట్టారు. పాతపాలెంలో పొలాల్లో పనిచేస్తున్న ఓ విద్యార్థిని గుర్తించి బడిలో చేర్చారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, మెరుగైన విద్య ఇవ్వాలని టీచర్లకు సూచించారు. చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Similar News

News March 20, 2026

ఇండోర్ స్టేడియం పనుల్లో జాప్యం..!

image

బాలసముద్రంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియం మరమ్మతు, సుందరీకరణ పనులు ఏడాదిగా నత్తనడకన సాగుతున్నాయి. రూ.68 లక్షలతో చేపట్టిన పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఆలస్యమవుతున్నాయి. దీంతో బ్యాడ్మింటన్ క్రీడాకారులు తాత్కాలికంగా ఇతర ప్రదేశాల్లో శిక్షణ తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News March 20, 2026

NLG: వచ్చే నెల నుంచి ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం

image

వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పేదలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్‌లో ఒకేసారి పంపిణీ చేయనుంది. NLG – 5,58,650, సూర్యాపేట – 3,55,057, యాదాద్రి-2,47,757 రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఈ పంపిణీ జరగనుంది. ఇప్పటికే
బియ్యం గోదాములకు చేరుకుంటున్నాయి.

News March 20, 2026

భారత్‌లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్

image

వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్-2028 నిర్వహణకు భారత్‌కు ఆతిథ్య హక్కులు దక్కాయి. ఈవెంట్ నిర్వహించేందుకు భారత్‌, న్యూజిలాండ్ పోటీ పడ్డాయి. మౌలిక వసతుల పరిశీలన అనంతరం ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈవెంట్ నిర్వహణకు అనుమతి వచ్చింది. దీంతో ఆసియాలో జపాన్, ఖతర్, చైనా తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. ఇక వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026 పోలాండ్ వేదికగా నేడు ప్రారంభం కానుంది.