News October 8, 2025

వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎంగా బాధ్యతలు స్వీకరించిన కుందు రామరావు

image

వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎంగా కుందు రామరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2006 IRSE బ్యాచ్‌కు చెందిన కుందు రామారావు భారత రైల్వేలోని వివిధ జోన్‌లలో కీలక హోదాల్లో సేవలందించారు. నాగ్‌పూర్‌లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్‌గా, రాయ్‌పూర్‌లో సీనియర్ ఏడీఈఎన్‌గా, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని బిలాస్‌పూర్‌లో సీనియర్ డివిజనల్ ఇంజినీర్‌గా, విజయవాడలో సీనియర్ డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేశారు.

Similar News

News March 31, 2026

విశాఖ: తణుకు TDR స్కాం వెనుక అసలు కథ(2/2)

image

తణుకు పురపాలక సంఘం 2021-22లో భూముల స్వాధీనం పేరుతో TDR బాండ్లు జారీ చేయడం వివాదానికి దారి తీసింది. సుమారు 21 ఎకరాల భూమికి గజాల లెక్కన రూ.800 కోట్ల విలువైన బాండ్లు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. మార్కెట్ విలువ కంటే 4 రెట్లు ఎక్కువగా బాండ్లు జారీ చేసినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ప్రభుత్వం బాండ్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టగా, కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది.

News March 31, 2026

విశాఖ: తణుకు TDR బాండ్లకు మోక్షం(1/2)

image

తణుకు TDR బాండ్ల వివాదానికి ముగింపు లభించింది. హైకోర్టు ఆదేశాలతో బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న బాండ్లపై ఆంక్షలు తొలగాయి. స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మెమో జారీ చేయడంతో రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేయడం ప్రారంభించాయి. గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్న బిల్డర్లకు ఇది పెద్ద ఊరటగా మారింది. ముఖ్యంగా విశాఖలో సుమారు 800 మంది బిల్డర్లకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించింది.

News March 31, 2026

క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే సమాచారం ఇవ్వండి: విశాఖ సీపీ

image

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపనున్నట్టు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి సోమవారం తెలిపారు. నగరంలో బెట్టింగ్ నిర్వాహకులపై, ఆన్‌లైన్ బుకీలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలన్నారు. ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100, 112 నంబరుకు గానీ సీపీ నంబర్ 7995095799కి సమాచారం ఇవ్వాలన్నారు.