News October 8, 2025
మేడ్చల్: ‘సమాచార హక్కు’ అందరూ తెలుసుకోవాలి

సమాచార హక్కు చట్టం గురించి అందరూ తెలుసుకొని చట్టం ద్వారా ప్రయోజనం పొందాలన్నదే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మనూ చౌదరి అన్నారు. సమాచార హక్కు చట్టం-2005 వారోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అవగాహాన సదస్సులో అదనపు కలెక్టర్లు విజయేందర్ రెడ్డి, రాధికగుప్తాలతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
Similar News
News March 6, 2026
మదనాపూర్: 3 రోజులు రైల్వే ట్రాక్ మూసివేత

మదనాపురం మండలం ఆత్మకూర్-మదనాపూర్ గ్రామాల మధ్య ఉన్న 90 ఏ నంబర్ రైల్వే గేటును ట్రాక్ మరమ్మతుల కారణంగా మార్చి 6 (శుక్రవారం) నుంచి మార్చి 8 (ఆదివారం) వరకు మూడు రోజులు మూసివేయనున్నట్లు రైల్వే అధికారి ప్రవీణ్, వనపర్తి రోడ్డు స్టేషన్ మాస్టర్ రామకృష్ణ తెలిపారు. ఈ కారణంగా సమీప గ్రామాల ప్రజలు, రైతులు, విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
News March 6, 2026
HYD: నీరు వృథా.. ఖజానా ఖాళీ!

జలమండలిని ఇప్పుడు ‘నాన్-రెవెన్యూ వాటర్’ (NRW) భూతం వేధిస్తోంది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో దాదాపు 40% లీకేజీలు, అక్రమ కనెక్షన్ల ద్వారా వృథా అవుతుండటంతో బోర్డు దివాలా తీసే స్థితికి చేరింది. అటు సుంకేసుల ఇన్-టేక్ వెల్ వద్ద సాంకేతిక సమస్యల భయం వెంటాడుతుంటే ఇటు కొండాపూర్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో తాగునీటిలో మురుగు కలుస్తోందన్న ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి.
News March 6, 2026
ఏఎంసీలు రైతులకు అండగా నిలవాలి: కలెక్టర్

రైతులు దళారీల చేతిలో మోసపోకుండా ఉండేందుకు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు అండగా నిలవాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్‌లో ఏఎంసీ ఛైర్మన్లు, కార్యదర్శులు, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా, నేరుగా ఏఎంసీలకు వచ్చి తమ పంటను విక్రయించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.


