News October 8, 2025

సంగారెడ్డి: పాఠశాలలో తనిఖీ చేయాలి: డీఈవో

image

సమగ్ర శిక్షలో పనిచేసే సెక్టోరియల్ అధికారులు రెగ్యులర్‌గా పాఠశాలను తనిఖీ చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఎలా చదువుతున్నారో నివేదికలు తయారు చేయాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా పరిశీలన చేయాలని పేర్కొన్నారు.

Similar News

News March 18, 2026

HYD: తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి..!

image

ఇంజినీర్ల బదిలీలు అత్యంత పారదర్శకంగా ఉండేలా నీటిపారుదల శాఖ తీసుకున్న నిర్ణయం బహుశా తెలంగాణ చరిత్రలోనే తొలిసారి కావొచ్చు. బదిలీల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సులు పనిచేయవని సర్క్యులర్‌ జారీ చేసింది. ఏదైనా సిఫార్సు లేఖతో సంప్రదిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. బదిలీల విషయమై అధికార పార్టీ నాయకుల నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ వరకు భారీ సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News March 18, 2026

PDPL: సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచాలి: ఎంపీ

image

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని కోరుతూ ఎంపీ వంశీకృష్ణ బుధవారం ఢిల్లీలో సీఎమ్‌పీఎఫ్ కమిషనర్ సజీశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. స్వల్ప పెన్షన్‌తో కార్మిక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆయన వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్.. నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News March 18, 2026

నెల్లూరు: దొంగల ముఠా అరెస్ట్

image

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 195 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసిన దొంగలు పట్టుబడ్డారు. వారి నుంచి 400KGల రాగి, 2ఆటోలు, 2బైక్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి SP సుబ్బరాయుడు తెలిపారు. నిందితులు గూడూరు(M) గొల్లపల్లికి చెందిన బండి వాసు(22), బూదూరు మణి(27), కత్తి పోలయ్య(40), చందు(25), ఏకోలు మధు(32)గా గుర్తించారు. మనుబోలు(M) యాచవరానికి చెందిన చల్లా రాఘవ వాళ్ల నుంచి రాగి కొనడంతో అరెస్ట్ చేశారు.