News April 7, 2024
ఆ జాబితాలో జగన్‌ది మొదటి స్థానం: లోకేశ్

AP: సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని సీఎంల జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి అప్పులకుప్పగా మార్చారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ అందిస్తామని తెలిపారు.
Similar News
News December 29, 2025
శివాలయంలో చండీ ప్రదక్షిణే ఎందుకు చేయాలి?

శివాలయంలో సోమసూత్రం వద్ద శివగణాధిపతి చండేశ్వరుడు ధ్యానంలో ఉంటాడు. సోమసూత్రం దాటితే ఆయన ధ్యానానికి భంగం కలుగుతుందని నమ్మకం. అలాగే శివ నిర్మాల్యం (పూలు, ప్రసాదం)పై పూర్తి అధికారం ఆయనదే. అందుకే గౌరవార్థం సోమసూత్రం దాటకుండా వెనక్కి మళ్లుతారు.
News December 29, 2025
ఇంటర్వ్యూతో ఆచార్య NG రంగా వర్సిటీలో టీచింగ్ పోస్టులు

AP: ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 8 టీచింగ్ అసోసియేట్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BSc, MSc(హోమ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్, హ్యూమన్ డెవలప్‌మెంట్ & ఫ్యామిలీ స్టడీస్, ఫుడ్ సైన్స్&న్యూట్రీషన్), PG లైబ్రరీ సైన్స్, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హతగల వారు ఇవాళ, రేపు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. వెబ్‌సైట్: angrau.ac.in
News December 29, 2025
నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు!

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరవనున్నారు. తొలుత 1.30AMకు VIP బ్రేక్ దర్శనాలను ప్రారంభిస్తారు. తెల్లవారుజామున 5.30కు ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన వారిని అనుమతిస్తారు. జనవరి 8వ తేదీ వరకు సుమారు 7.7 లక్షల మందికి దర్శనం కల్పించేలా TTD ఏర్పాట్లు చేసింది.


