News October 8, 2025

ANU: బీ.ఫార్మసీ, ఫార్మా.డి. పరీక్షలు ప్రారంభం

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం నుంచి బీ.ఫార్మసీ రెండవ సెమిస్టర్ (రెగ్యులర్), ప్రథమ సెమిస్టర్ (సప్లమెంటరీ) పరీక్షలతో పాటు ఫార్మా.డి. పరీక్షలు సజావుగా ప్రారంభమయ్యాయి. బి.ఫార్మసీ పరీక్షలు18 పరీక్షా కేంద్రాల్లోను, ఫార్మా.డీ.పరీక్షలు 10 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయం పీజీ, వృత్తి విద్యా కోర్సుల పరీక్షల సమన్వయకర్త ఆచార్య ఎం.సుబ్బారావు పరీక్షలను పరిశీలించారు.

Similar News

News April 2, 2026

గుంటూరులో మండిపోనున్న ఎండలు

image

పసిఫిక్ మహాసముద్రంలో మే నెలలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీనివల్ల 2026 వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. కోస్తా ఆంధ్రాలోని గుంటూరులో సాధారణం కంటే ఎండలు దంచికొట్టనున్నాయి. వేడి వాతావరణం మరింత పెరగనుంది. ఈ ఎల్‌నినో ప్రభావం ప్రారంభ రుతుపవనాలపై పడనుంది. అయితే అడపాదడపా ప్రీ-మాన్సూన్ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News April 2, 2026

ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

image

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బకాయిలను త్వరితగతిన చెల్లించేలా కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న రూ.7,059 కోట్ల బిల్లులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల లభ్యత ఆధారంగా ఈ చెల్లింపులు జరిగేలా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు.

News April 2, 2026

ఉండవల్లి ఫైరింగ్ రేంజ్ ఆక్టోపస్‌కి కేటాయింపు

image

మంగళగిరి APSP 6వ బెటాలియన్ పరిధిలోని ఉండవల్లి ఫైరింగ్ రేంజ్‌ను OCTOPUS విభాగానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. 45 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ రేంజ్ గత ఐదు దశాబ్దాలుగా వినియోగంలో ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పోలీసులు ఇక్కడ శిక్షణ పొందుతుండగా, ఇప్పటివరకు తాడేపల్లి వడ్డేశ్వరం వద్ద ప్రైవేట్ భవనంలో OCTOPUS విభాగం ఉంది.