News October 8, 2025
కర్ణాటకలో 5వ ర్యాంకు సాధించా: కలెక్టర్

పదో తరగతిలో 580 మార్కులతో కర్ణాటకలో ఐదో ర్యాంకు సాధించానని తన అనుభవాలను కలెక్టర్ వినోద్ కుమార్ చందోలు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులతో పంచుకున్నారు. ప్రజలకు మరింతగా సేవలందించాలంటే ఐఏఎస్ ద్వారానే సాధ్యమని గుర్తించానన్నారు. ఆ దిశగా ప్రణాళిక మార్చుకున్నానని చెప్పారు. విద్యార్థులు ఉన్నత భావాలతో విజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. ఎంచుకున్న లక్ష్యానికి చేరుకోవాలంటే కృషి, పట్టుదల ఉండాలన్నారు.
Similar News
News March 8, 2026
సెక్షన్ 22-A, డాటెడ్ లాండ్స్ అభ్యర్థనలపై కలెక్టర్ సమీక్ష

పుట్టపర్తి కలెక్టరేట్‌లో రెవెన్యూ విభాగానికి సంబంధించిన సెక్షన్ 22-A నిషేధిత భూముల జాబితా శుద్ధి, డాటెడ్ లాండ్స్ అభ్యర్థనలపై కలెక్టర్ శ్యాంప్రసాద్ శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో 22-A మార్పులకు 453 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అదేవిదంగా డాటెడ్ లాండ్స్‌కు సంబంధించి 281 అభ్యర్థనలు అందగా, వాటిలో ఎక్కువ అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు.
News March 8, 2026
ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు లేదు: SPDCL CMD

TG: ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు ఉండదని SPDCL CMD జితేశ్.వి.పాటిల్ స్పష్టం చేశారు. SPDCL పరిధిలో మొత్తం 1.20 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని, గతేడాదితో పోలిస్తే 12.09L మంది పెరిగారని వెల్లడించారు. ‘గృహాజ్యోతి’ పథకం వల్ల విద్యుత్ చౌర్యం తగ్గిందన్నారు. ఈ ఏడాది FEB వరకు 5.44కోట్ల జీరో బిల్లులు జారీ చేయగా, ప్రభుత్వం నుంచి రూ.1930.66కోట్ల సబ్సిడీ డబ్బులు వచ్చాయని తెలిపారు.
News March 8, 2026
యుద్ధంలోకి వస్తామన్న UK? అవసరం లేదన్న ట్రంప్!

మిడిల్ ఈస్ట్‌కు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను పంపాలని UK అనుకుంటున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ‘ఒకప్పుడు మన గొప్ప మిత్ర దేశమైన UK ఎట్టకేలకు మిడిల్ ఈస్ట్‌కు రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను పంపించాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. కానీ మాకు అవి అవసరం లేదు PM స్టార్మర్. మేం ఆల్రెడీ యుద్ధం గెలిచాం. ఇప్పుడు యుద్ధంలో చేరేవారు మాకు అవసరం లేదు’ అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.


