News October 8, 2025

వైద్య ఆరోగ్య ప్రగతిలో జిల్లాను ముందుంచాలి: కలెక్టర్

image

రాష్ట్రంలోనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖను ప్రగతిలో ముందు వరుసలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్నాయని, గుర్తించిన వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News March 13, 2026

గ్యాస్ బుక్ చేసే వారికి ఎస్పీ సూచనలు

image

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు SP వకుల్ జిందాల్ సూచించారు. వంటగ్యాస్ సిలెండర్ల కొరత ఉందనే అపోహలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మల్చుకొని ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. అదనపు సిలెండర్లు కేటాయిస్తామని బురిడీ కొట్టిస్తున్నారని వివరించారు. అనుమానస్పద లింకులు ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చెయ్యొద్దని సూచించారు.

News March 13, 2026

జగిత్యాల: ముగిసిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు

image

జగిత్యాల జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు 30 కేంద్రాల్లో నిర్వహించగా 97.55% హాజరు నమోదైంది. జనరల్ కోర్సుల్లో 5671 మందికి గాను 5571 మంది హాజరై 100 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 546 మందికి గాను 494 మంది హాజరై 52 మంది గైర్హాజరయ్యారు. నేటితో జనరల్ విభాగం పరీక్షలు ముగిశాయి. పరీక్షలు సరిగా రాయకపోయిన వారు మేలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని పరీక్షల కన్వీనర్ నారాయణ తెలిపారు.

News March 13, 2026

గ్యాస్ ధరల ప్రభావం ప్రజలపై పడకుండా చూడాలి: జీవన్ రెడ్డి

image

జగిత్యాలలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచంపై పడుతోందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో వంట గ్యాస్ ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతోందన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. రూ.500 సిలిండర్ పథకంలో ధరల పెంపు భారం వినియోగదారులపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.