News October 8, 2025
జాతీయ సదస్సుకు పెబ్బేరు ఉపాధ్యాయుడు ఎంపిక

పెబ్బేరు మండలం యాపర్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మురళి కృష్ణ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో “ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్” ఆధ్వర్యంలో రేపు జరిగే జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. “నో బ్యాగ్ డే” ల ద్వారా స్థానిక సంస్కృతి, వృత్తులను బోధించడంపై ఆయన పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు.
Similar News
News March 25, 2026
బాసర: ‘నా భర్త లేని లోకంలో నేనుండలేను’

తన భర్త లేని లోకంలో తానుండలేను అని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బాసర గోదావరి నది వద్ద చోటు చేసుకుంది. బాసర సీఐ కిరణ్ తెలిపిన వివరాలు.. ఇందల్వాయి మండలం ఆసన్‌పల్లి గ్రామానికి చెందిన పద్మ భర్త ఆనంద్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. మనస్తాపంతో పద్మ బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News March 25, 2026
సౌత్ ఇండియా ఖోఖో పోటీలకు కృష్ణా యూనివర్సిటీ జట్టు

కర్ణాటకలోని దావణగిరి యూనివర్సిటీలో ఈనెల 26 నుంచి 29 వరకు జరిగే దక్షిణ భారత విశ్వవిద్యాలయాల పురుషుల ఖోఖో పోటీలకు కృష్ణా యూనివర్సిటీ జట్టు బుధవారం బయలుదేరింది. జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విశ్వవిద్యాలయ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ప్రిన్సిపాల్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మేక రమేశ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రెటరీ కృష్ణారెడ్డి, కోచ్ మనోహర్ పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
News March 25, 2026
నల్గొండ అసెంబ్లీ స్థానం రెండుగా విభజన?

ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. NLG అసెంబ్లీ నియోజకవర్గాన్ని రెండుగా విడగొట్టి, కొత్తగా ‘ NLG అర్బన్’ పేరుతో మరో స్థానాన్ని ఏర్పాటు చేస్తారనే ప్రచారం జోరందుకుంది. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పెరుగుతున్న జనాభా రీత్యా NLG పట్టణాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.


