News October 8, 2025

SBI డౌన్.. UPI సేవలకు అంతరాయం

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) UPI సేవల్లో అంతరాయం ఏర్పడింది. ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నామంటూ కస్టమర్లు SMలో రిపోర్ట్ చేస్తున్నారు. దీనిపై SBI స్పందించింది. టెక్నికల్ సమస్య వల్ల UPI సేవలు డిక్లైన్ అవుతున్నాయంది. అంతరాయానికి చింతిస్తున్నామని, 8PM లోగా సరిచేస్తామని స్టేట్‌మెంట్ విడుదల చేసింది. అయితే ఆ సమయం దాటినా ఇంకా సమస్య పరిష్కారం కాలేదని కస్టమర్లు వాపోతున్నారు. మీకూ ఈ సమస్య ఎదురైందా?

Similar News

News October 9, 2025

అక్టోబర్ 9: చరిత్రలో ఈ రోజు

image

1945: భారతీయ సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్ జననం
1962: గాయని SP శైలజ జననం
1967: గెరిల్లా నాయకుడు, క్యూబా విప్లవకారుడు చే గువేరా(ఫొటోలో) మరణం
1974: దర్శకుడు వివి వినాయక్ జననం
2013: నటుడు శ్రీహరి మరణం
✦ ప్రపంచ తపాలా దినోత్సవం
✦ ప్రపంచ కంటిచూపు దినోత్సవం

News October 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 9, 2025

భూములిచ్చిన ఊళ్లలోనే రిటర్నబుల్ ప్లాట్లు: CM చంద్రబాబు

image

AP: అమరావతి అభివృద్ధితో పాటు రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాలని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ ఊళ్లో భూములిచ్చిన రైతులకు ఆ ఊళ్లోనే రిటర్నబుల్ ప్లాట్లను ఇచ్చి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో 53వ CRDA అథారిటీ సమావేశంలో మొత్తంగా 18 అంశాలపై చర్చించారు. అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి CRDA అథారిటీ ఆమోదం తెలిపింది.