News October 8, 2025
SRCL: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ సమీక్ష

వరి ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్(2025-26) ధాన్యం కొనుగోళ్ల సన్నాహక సమావేశం వివిధ శాఖల అధికారులు, ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News October 9, 2025
రాయికల్: యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్‌లో ‘పుట్టింటి గౌరమ్మ’ ఎంపిక

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌లో రాయికల్ మండలం, అల్లిపూర్ గ్రామానికి చెందిన కునమల్ల సుమన్ రూపొందించిన ‘పుట్టింటి గౌరమ్మ’ షార్ట్ ఫిలిం ఎంపికైంది. కేవలం మూడు నిమిషాల నిడివి గల ఈ చిత్రానికి సుమన్ స్వయంగా దర్శకుడు, నటుడు, నిర్మాతగా వ్యవహరించారు. తెలంగాణ సాంస్కృతిక విలువలను ప్రతిబింబించేలా తీసిన ఈ చిత్రానికి ప్రభుత్వం గుర్తింపుతో పాటు పారితోషికాన్ని ప్రకటించింది.
News October 9, 2025
NZB: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 11న సాయంత్రం 5 గంటల వరకు మొదటి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. 12న నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటు నామినేషన్లకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ప్రకటన,13న అప్పీళ్ల స్వీకరణ, 14న అప్పీళ్ల పరిష్కారం, 15న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, 3 గంటల తరువాత పోటీలోని అభ్యర్థుల జాబితా ప్రచురణ, 23న పోలింగ్ అన్నారు.
News October 9, 2025
అక్టోబర్ 9: చరిత్రలో ఈ రోజు

1945: భారతీయ సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్ జననం
1962: గాయని SP శైలజ జననం
1967: గెరిల్లా నాయకుడు, క్యూబా విప్లవకారుడు చే గువేరా(ఫొటోలో) మరణం
1974: దర్శకుడు వివి వినాయక్ జననం
2013: నటుడు శ్రీహరి మరణం
✦ ప్రపంచ తపాలా దినోత్సవం
✦ ప్రపంచ కంటిచూపు దినోత్సవం