News October 8, 2025
సంగారెడ్డి: ‘అన్ని పాఠశాలలో డిజిటల్ లిట్రసి తరగతులు’

జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ లిట్రసి తరగతులు అమలు చేయాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5 వ తరగతులకు అమలు చేసే విధంగా మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ ప్రధానోపాధ్యాయులు గమనించాలని పేర్కొన్నారు.
Similar News
News October 9, 2025
ADB: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 9 నుంచి ఎస్ఈసీ విడుదల చేయనున్న నేపథ్యంలో రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 9న నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలివిడత నామినేషన్లు స్వీకరించడం, 23న తొలివిడత పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. మొదటి విడతలో 80 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయన్నారు.
News October 9, 2025
ఎన్నికల్లో వ్యయ పరిమితి దాటొద్దు: కలెక్టర్ సిక్తా పట్నాయక్

స్థానిక సంస్థల ఎన్నికల్లో కమిషనర్ నిర్దేశించిన వ్యయ గరిష్ట పరిమితిని మించి ఖర్చు చేయరాదని నారాయణపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
News October 9, 2025
రాబోయే 2-3 గంటల్లో వర్షాలు

TG: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని IMD HYD కేంద్రం వెల్లడించింది. జగిత్యాల, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.