News October 8, 2025

KMR: జిల్లాలో రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ షురూ!

image

BC రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో షెడ్యూల్ ప్రకారం OCT 9న నామినేషన్ల ప్రక్రియ షురూ కానున్నాయి. కామారెడ్డి జిల్లాలో తొలి విడతలో భాగంగా 14 మండలాల్లో ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్లు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వెల్లడించారు.

Similar News

News October 9, 2025

ADB: స్కాలర్ షిప్ కోసం APPLY చేసుకోండి

image

2025-26 విద్యా సంవత్సరానికి 9, 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ పాస్ http://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తులు చేసుకోవాలని బీసీ అభివృద్ధి శాఖాధికారి రాజలింగు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారి వార్షిక ఆదాయము రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలకు చెందిన వారికి రూ.2లక్షలు ఉండాలన్నారు.
..SHARE IT

News October 9, 2025

ADB: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

image

స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఈ నెల 9 నుంచి ఎస్ఈసీ విడుదల చేయనున్న నేపథ్యంలో రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 9న నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలివిడత నామినేషన్లు స్వీకరించడం, 23న తొలివిడత పోలింగ్‌, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. మొదటి విడతలో 80 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయన్నారు.

News October 9, 2025

ఎన్నికల్లో వ్యయ పరిమితి దాటొద్దు: కలెక్టర్ సిక్తా పట్నాయక్

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో కమిషనర్ నిర్దేశించిన వ్యయ గరిష్ట పరిమితిని మించి ఖర్చు చేయరాదని నారాయణపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.