News October 8, 2025

NRPT: ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజనను సద్వినియోగం చేసుకోవాలి’

image

పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి జిల్లా ఎంపికైందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దినేష్ చతుర్వేది అన్నారు. బుధవారం డిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు అవలంబించడం, నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటు చేయడం కార్యక్రమ లక్ష్యమన్నారు.

Similar News

News October 9, 2025

జగిత్యాల: పెండింగ్‌ కేసుల సంఖ్య తగ్గించాలి: అడిషనల్ కలెక్టర్

image

జగిత్యాల పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించి, కేసుల సంఖ్య తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గత నెలలో జరిగిన నేరాలపై బుధవారం చర్చించారు. పెండింగ్‌ కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్‌ఓపీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులను ఛేదించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, ఎన్నికల నియమావళిపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు.

News October 9, 2025

ADB: స్కాలర్ షిప్ కోసం APPLY చేసుకోండి

image

2025-26 విద్యా సంవత్సరానికి 9, 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ పాస్ http://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తులు చేసుకోవాలని బీసీ అభివృద్ధి శాఖాధికారి రాజలింగు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారి వార్షిక ఆదాయము రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలకు చెందిన వారికి రూ.2లక్షలు ఉండాలన్నారు.
..SHARE IT

News October 9, 2025

ADB: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

image

స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఈ నెల 9 నుంచి ఎస్ఈసీ విడుదల చేయనున్న నేపథ్యంలో రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 9న నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలివిడత నామినేషన్లు స్వీకరించడం, 23న తొలివిడత పోలింగ్‌, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. మొదటి విడతలో 80 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయన్నారు.