News April 7, 2024

కుప్పంలో బాబు.. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయం: అంబటి

image

AP: కుప్పంలో చంద్రబాబు.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి పాలవుతారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘చంద్రబాబు నాపై తప్పుడు ప్రచారం చేశారు. డబ్బుల కోసం నేనెప్పుడూ కక్కుర్తి పడలేదు. బాబు తప్పిదంతోనే పోలవరం ఆలస్యమవుతోంది. ఓటమి ఖాయమవడంతో చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. పవన్ రెండు రోజులు ప్రచారం చేసి 5 రోజులు పడుకుంటారు. పొత్తు పెట్టుకోవడం అంటే సమాధి కట్టుకోవడమే’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News October 9, 2024

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 తగ్గి రూ.76,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.70,300కి చేరుకుంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 పడిపోయి రూ.1,00,000కి చేరింది.

News October 9, 2024

WTC: రికార్డు సృష్టించిన రూట్

image

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) చరిత్రలో 5వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ (5005) రికార్డు సృష్టించారు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఈ ఘనత సాధించారు. 59 మ్యాచుల్లో అతను ఈ ఫీట్‌ను అందుకోగా, అతని తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు లబుషేన్(3904), స్మిత్(3,484) ఉన్నారు.

News October 9, 2024

RBI MPC: FY25లో రియల్ జీడీపీ గ్రోత్‌ 7.2%

image

FY25లో భారత రియల్ జీడీపీ గ్రోత్‌ను 7.2 శాతంగా RBI అంచనా వేసింది. Q1లో 8 కోర్ ఇండస్ట్రీస్ ఔట్‌పుట్ 1.8% తగ్గినట్టు తెలిపింది. కరెంటు, కోల్, సిమెంట్ ఉత్పత్తిపై అధిక వర్షపాతం ప్రభావం చూపినట్టు పేర్కొంది. ఇన్‌ఫ్లేషన్ గుర్రాన్ని కట్టడి చేశామని, కళ్లెం విప్పేముందు జాగ్రత్తగా ఉండాలంది. FY25లో ఇన్‌ఫ్లేషన్ 4.5% ఉంటుందని చెప్పింది. ఎమర్జింగ్ కరెన్సీలతో పోలిస్తే రూపాయి స్థిరంగా ఉన్నట్టు వెల్లడించింది.