News October 8, 2025
దగ్గు సిరప్‌పై కేంద్రం కీలక ఆదేశాలు

దగ్గు సిరప్‌తో MP, రాజస్థాన్‌లో 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో నలుగురు మరణించడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. రా మెటీరియల్స్, ఫైనల్ ప్రొడక్ట్స్ అన్నీ క్షుణ్నంగా టెస్ట్ చేయాలంది. 4 ఏళ్లలోపు పిల్లలకు కోల్డ్, కాఫ్ సిరప్‌లు ఇవ్వొద్దని చెప్పినా విక్రయాలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Similar News
News October 9, 2025
అందుబాటులోకి తిరుమల క్యాలెండర్లు, డైరీలు

తిరుమల శ్రీవారి భక్తుల కోసం TTD 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. tirumala.org, ttdevasthanams.ap.gov.inలో వీటిని పొందవచ్చని తెలిపింది. అలాగే తిరుమలలో సేల్స్ కౌంటర్, ధ్యాన మందిరం, శ్రీనివాసం, విష్ణు నివాసం, టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్(తిరుచానూరు), విజయవాడ, వైజాగ్, చెన్నై, HYDలోని శ్రీవారి ఆలయాల్లో, ఇతర ప్రాంతాల్లోని TTD కళ్యాణ మండపాల్లోనూ అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
News October 9, 2025
రాబోయే 2-3 గంటల్లో వర్షాలు

TG: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని IMD HYD కేంద్రం వెల్లడించింది. జగిత్యాల, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.
News October 9, 2025
అక్టోబర్ 9: చరిత్రలో ఈ రోజు

1945: భారతీయ సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్ జననం
1962: గాయని SP శైలజ జననం
1967: గెరిల్లా నాయకుడు, క్యూబా విప్లవకారుడు చే గువేరా(ఫొటోలో) మరణం
1974: దర్శకుడు వివి వినాయక్ జననం
2013: నటుడు శ్రీహరి మరణం
✦ ప్రపంచ తపాలా దినోత్సవం
✦ ప్రపంచ కంటిచూపు దినోత్సవం