News April 7, 2024

ప.గో.: ఆయన గెలిచిన ప్రతిసారి కొత్తపార్టీ నుంచే..

image

భీమవరం నియోజకవర్గం నుంచి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి తరఫున బరిలో ఉన్న జనసేన అభ్యర్థి పులపర్తి ఆంజనేయులు ఓ ప్రత్యేకతను కైవసం చేసుకున్నారు. 2009లో ఆయన కాంగ్రెస్ నుంచి, 2014లో టీడీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2019లో టీడీపీ నుంచి పోటీ చేసినా.. ఓడిపోయారు. తాజాగా జనసేనలో చేరి టికెట్ దక్కించుకున్నారు. గతంలో 2 వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందిన ఆయన తాజాగా మరోపార్టీ నుంచి బరిలో ఉన్నారు.

Similar News

News September 10, 2025

అత్తిలిలో నేటి నుంచి ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్

image

అత్తిలి రైల్వే స్టేషన్‌లో బుధవారం నుంచి సర్కార్, తిరుపతి పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగనున్నాయి. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు కూటమి నేతలు అత్తిలి మండలంలో ఆటో ప్రచారం ప్రారంభించారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగేందుకు గత కొంతకాలంగా చేస్తున్న పోరాటం ఫలించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 4న కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రైలు హాల్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

News September 10, 2025

జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో నిర్మాణం పూర్తి అయిన మల్టీపర్పస్ గోడౌన్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాకు నాబార్డ్ మంజూరు చేసిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 24 మల్టీ పర్పస్ గోడౌన్స్‌లో 14 పూర్తి చేశామన్నారు. ఇంకా 10 గోడౌన్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు.

News September 9, 2025

ఆకివీడు: మహిళ‌పై దాడికి దిగిన వ్యక్తిపై కేసు నమోదు

image

ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై దాడికి దిగి చంపేస్తానని బెదిరించిన వ్యక్తిపై ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని సిద్దాపురం గ్రామానికి చెందిన సువ్వారి రంగమ్మ మరో ముగ్గురితో కలిసి ఆటోలో వస్తుండగా అదే ఆటోలో ప్రయాణిస్తున్న సింగపర్తి కొండ దౌర్జన్యం చేసి చంపుతానని బెదిరించినట్లు ఆకివీడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెడ్ కానిస్టేబుల్ జే నాగేశ్వరరావు కేసు నమోదు చేసినట్లు వివరించారు.