News October 9, 2025
భద్రాద్రి: శాంతి చర్చలకు సిద్ధమే: మావోయిస్టు పార్టీ

రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి ప్రభుత్వం తమతో చర్చలు జరపడానికి చొరవ తీసుకోవాలని, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘం సింగరేణి కార్మిక సమైఖ్య (సికాస) కార్యదర్శి అశోక్ బుధవారం ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సోను (అభయ్) చేసిన శాంతి ప్రతిపాదనను సికస సమర్థిస్తుందని అశోక్ స్పష్టం చేశారు. సాయుధ పోరాటాన్ని విరమించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Similar News
News October 9, 2025
మహబూబ్‌నగర్: యువ జంట సూసైడ్

భూత్పూర్ మం. కొత్తూరులో యువ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం వెలుగు చూసింది. కొత్తూరుకు చెందిన రమేశ్(28)కు జూన్‌లో గోపాల్పేట మం. చీర్కేపల్లి వాసి నిర్మల(22)తో వివాహమైంది. అన్యోన్యంగా ఉంటున్న దంపతులు.. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. నిర్మల నేలపై పడి ఉండగా.. రమేశ్ తాడుకు వేలాడుతూ కనిపించాడు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 9, 2025
మహేశ్-రాజమౌళి సినిమా పేరు ‘వారణాసి’?

మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నవంబర్ 16న టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
News October 9, 2025
ఈ నెల 12న పల్స్ పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్

TG: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 290 జిల్లాల్లో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో TG నుంచి HYD, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, HNK జిల్లాలున్నాయి. వీటితో పాటు WGLలో ఈ నెల 12న వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 0-5 ఏళ్ల వయసు పిల్లలకు డ్రాప్స్ వేస్తారు. పోలియో కేసులు నమోదవుతున్న BAN వంటి దేశాల నుంచి INDకు రాకపోకల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.