News October 9, 2025

గుర్తుంచుకోండి.. మీ కర్మలకు మీరే బాధ్యులు!

image

ఒకప్పుడు దొంగగా ఉన్న బోయవాడు ‘నా పాపంలో భాగం పంచుకుంటారా’ అని కుటుంబసభ్యులను అడిగితే.. వాళ్లు ‘వద్దు’ అని తేల్చి చెప్పారు. ఆ మాటకు జ్ఞానోదయం పొందిన ఆ బోయవాడు నారదుడు ఉపదేశించిన మంత్రాన్ని పఠించి, పాప విముక్తుడై వాల్మీకిగా మారి, రామాయణాన్ని రచించాడు. లోకం కూడా అంతే! ఎప్పుడూ తన లాభాలనే చూస్తుంది. మన కర్మలకు మనమే బాధ్యులమవుతాం. ఈ సత్యాన్ని తెలుసుకొని మంచి మార్గంలో పయనిస్తేనే ఆయనలా మహర్షులం అవుతాం.

Similar News

News October 9, 2025

మహేశ్-రాజమౌళి సినిమా పేరు ‘వారణాసి’?

image

మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నవంబర్ 16న టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

News October 9, 2025

ఈ నెల 12న పల్స్ పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్

image

TG: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 290 జిల్లాల్లో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో TG నుంచి HYD, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, HNK జిల్లాలున్నాయి. వీటితో పాటు WGLలో ఈ నెల 12న వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 0-5 ఏళ్ల వయసు పిల్లలకు డ్రాప్స్ వేస్తారు. పోలియో కేసులు నమోదవుతున్న BAN వంటి దేశాల నుంచి INDకు రాకపోకల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

News October 9, 2025

సీజేఐపై దాడి.. అడ్వొకేట్ రాకేశ్‌పై FIR నమోదు

image

సీజేఐ BR గవాయ్‌పై ఈ నెల 6న షూ విసిరి దాడికి పాల్పడిన అడ్వొకేట్ <<17935118>>రాకేశ్ కిషోర్‌పై<<>> బెంగళూరులో జీరో FIR నమోదయింది. ఆల్ ఇండియా అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భక్తవత్సల ఫిర్యాదుతో విధానసౌధ పోలీసులు BNS 132, 133 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాకేశ్‌ శిక్షార్హుడని, వెంటనే చర్యలు తీసుకోవాలని అడ్వొకేట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ కేసును పోలీసులు ఢిల్లీలోని తిలక్ మార్గ్ పీఎస్‌కు బదిలీ చేశారు.