News October 9, 2025
ఆ లక్ష్య సాధనకు టీచర్ల సహకారం అవసరం: లోకేశ్

AP: టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మ్యూచువల్, స్పౌజ్ బదిలీలతో పాటు భాషా పండితులకు పదోన్నతులు దక్కిన నేపథ్యంలో ఆయన్ను పలువురు టీచర్లు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘విద్యాశాఖలో తొలి ఏడాది సంస్కరణలు పూర్తి చేశాం. వచ్చే నాలుగేళ్ల పాటు ఫలితాలపైనే దృష్టిసారిస్తాం. విద్యావ్యవస్థను నం.1గా తీర్చిదిద్దాలనేదే లక్ష్యం. ఇందుకు టీచర్ల సహకారం కావాలి’ అని అన్నారు.
Similar News
News October 9, 2025
కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య 40% తగ్గుదల

భారత్‌లో కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య తగ్గింది. 2024లో మొదటి 9 నెలల్లో 3.61Cr ఖాతాలు తెరవగా, ఈ ఏడాది JAN-SEP మధ్య 2.18Cr అకౌంట్స్ యాడ్ అయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు 40% తగ్గింది. 2024లో సగటున నెలకు 40లక్షల అకౌంట్లు నమోదు కాగా, 2025లో సగటున 24 లక్షల ఖాతాలు మాత్రమే తెరుచుకున్నాయి. ఏడాది కాలంగా పెద్దగా రిటర్న్స్ రాకపోవడం, IPOల తగ్గుదల వంటివి ఇందుకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
News October 9, 2025
మహేశ్-రాజమౌళి సినిమా పేరు ‘వారణాసి’?

మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నవంబర్ 16న టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
News October 9, 2025
ఈ నెల 12న పల్స్ పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్

TG: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 290 జిల్లాల్లో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో TG నుంచి HYD, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, HNK జిల్లాలున్నాయి. వీటితో పాటు WGLలో ఈ నెల 12న వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 0-5 ఏళ్ల వయసు పిల్లలకు డ్రాప్స్ వేస్తారు. పోలియో కేసులు నమోదవుతున్న BAN వంటి దేశాల నుంచి INDకు రాకపోకల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.