News October 9, 2025
శుభ సమయం (09-10-2025) గురువారం

✒ తిథి: బహుళ తదియ తె.2.51
✒ నక్షత్రం: భరణి రా.12.35 వరకు
✒ శుభ సమయం: ఉ.8.00-10.00, తిరిగి మ.3.40-సా.4.10
✒ రాహుకాలం: మ.1.30-3.00
✒ యమగండం: ఉ.6.00-7.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-10.48, తిరిగి మ.2.48-3.36
✒ వర్జ్యం: ఉ.11.13-మ.12.43 వరకు
✒ అమృత ఘడియలు: రా.12.30-1.59 వరకు
Similar News
News October 9, 2025
బిలియనీర్ల క్లబ్‌లోకి క్రిస్టియానో రొనాల్డో

బిలియనీర్ అయిన తొలి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పోర్చుగల్ స్టార్ రొనాల్డో నిలిచారు. ఆయన సంపద $1.4bn(₹12,352.08Cr) అని బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసింది. 2002-2023 మధ్య మ్యాచుల ద్వారా $550M+(₹4,869.57Cr), నైక్ (₹159.25Cr), అర్మానీ, కాస్ట్రోల్ బ్రాండ్లు, ఇతర ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ₹1,554Crకు పైగా ఆర్జించినట్లు పేర్కొంది. సౌదీ క్లబ్ అల్-నాస్ర్‌తో 2023లో $200M, తాజాగా $400Mలకు ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది.
News October 9, 2025
కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య 40% తగ్గుదల

భారత్‌లో కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య తగ్గింది. 2024లో మొదటి 9 నెలల్లో 3.61Cr ఖాతాలు తెరవగా, ఈ ఏడాది JAN-SEP మధ్య 2.18Cr అకౌంట్స్ యాడ్ అయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు 40% తగ్గింది. 2024లో సగటున నెలకు 40లక్షల అకౌంట్లు నమోదు కాగా, 2025లో సగటున 24 లక్షల ఖాతాలు మాత్రమే తెరుచుకున్నాయి. ఏడాది కాలంగా పెద్దగా రిటర్న్స్ రాకపోవడం, IPOల తగ్గుదల వంటివి ఇందుకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
News October 9, 2025
మహేశ్-రాజమౌళి సినిమా పేరు ‘వారణాసి’?

మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నవంబర్ 16న టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.