News October 9, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 09, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు
✒ ఇష: రాత్రి 7.11 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News October 9, 2025

భారీ వర్షాలు.. చెరకులో నీరు నిలిచి ఉందా?

image

ఇటీవల వర్షాలకు చాలా చోట్ల చెరకు పంట ముంపునకు గురైంది. అయితే చెరకులో నీరు నిల్వ ఉండకుండా, వెంటనే బయటకు పంపాలి. వర్షాలు తగ్గిన వెంటనే ఎకరానికి 50 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్ చెరకు మొక్కల మొదళ్ల దగ్గర గుంటలు చేసి వేసి కప్పాలి. ఒకవేళ పొలం నుంచి మురుగు నీటిని తీయని పరిస్థితుల్లో పైపాటుగా లీటర్ నీటికి 2.5గ్రా. యూరియా, 2.5గ్రా. పొటాష్ ఎరువులు కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

News October 9, 2025

నేటి నుంచి ఎంఫార్మసీ, ఫార్మాడీ ప్రవేశాల ప్రక్రియ

image

TG: M.Pharm, ఫార్మాడీ ప్రవేశాలకు సంబంధించి ఫేజ్-1 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి ఈనెల 11 వరకు ఆన్‌లైన్ <>రిజిస్ట్రేషన్<<>>&వెరిఫికేషన్, 13న ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ లిస్ట్ విడుదల, కరెక్షన్స్‌కు అవకాశమిచ్చారు. 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు, 16న వెబ్ ఆప్షన్ల ఎడిట్, 21న కాలేజీల వారీగా అభ్యర్థుల లిస్ట్ విడుదల, 25వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లింపు ఉంటుంది.

News October 9, 2025

ఏ దేవుడి దర్శనానికి ఏ రంగు దుస్తులు ధరించాలి?

image

ఆధ్యాత్మిక నియమాల ప్రకారం.. దైవ దర్శనానికి కొన్ని రంగుల దుస్తులు ధరించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ‘లక్ష్మీదేవి, సరస్వతి, శివుడి దర్శనానికి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. గణేశుడి గుడికి వెళ్తే ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి దర్శనానికి పసుపు రంగు దుస్తులు ఉత్తమం. అయ్యప్ప స్వామి దర్శనానికి నలుపు ధరించాలి. ఫలితంగా దైవానుగ్రహం లభిస్తుంది’ అని అంటున్నారు.