News October 9, 2025
భారత్‌తో విభేదాలు.. ట్రంప్‌కు US లా మేకర్స్ వార్నింగ్

భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో US కాంగ్రెస్‌కు చెందిన 19 మంది లా మేకర్స్ ట్రంప్‌కు లేఖ రాశారు. ఇండియాతో రిలేషన్స్ మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంతో సఖ్యత లేకపోవడం ప్రతికూలంగా మారుతుందని హెచ్చరించారు. భాగస్వామ్యాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు కృషి చేయాలని సూచించారు. భారత గూడ్స్‌పై 50% టారిఫ్స్ విధించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
Similar News
News October 9, 2025
భారీ వర్షాలు.. చెరకులో నీరు నిలిచి ఉందా?

ఇటీవల వర్షాలకు చాలా చోట్ల చెరకు పంట ముంపునకు గురైంది. అయితే చెరకులో నీరు నిల్వ ఉండకుండా, వెంటనే బయటకు పంపాలి. వర్షాలు తగ్గిన వెంటనే ఎకరానికి 50 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్ చెరకు మొక్కల మొదళ్ల దగ్గర గుంటలు చేసి వేసి కప్పాలి. ఒకవేళ పొలం నుంచి మురుగు నీటిని తీయని పరిస్థితుల్లో పైపాటుగా లీటర్ నీటికి 2.5గ్రా. యూరియా, 2.5గ్రా. పొటాష్ ఎరువులు కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
News October 9, 2025
నేటి నుంచి ఎంఫార్మసీ, ఫార్మాడీ ప్రవేశాల ప్రక్రియ

TG: M.Pharm, ఫార్మాడీ ప్రవేశాలకు సంబంధించి ఫేజ్-1 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి ఈనెల 11 వరకు ఆన్‌లైన్ <
News October 9, 2025
ఏ దేవుడి దర్శనానికి ఏ రంగు దుస్తులు ధరించాలి?

ఆధ్యాత్మిక నియమాల ప్రకారం.. దైవ దర్శనానికి కొన్ని రంగుల దుస్తులు ధరించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ‘లక్ష్మీదేవి, సరస్వతి, శివుడి దర్శనానికి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. గణేశుడి గుడికి వెళ్తే ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి దర్శనానికి పసుపు రంగు దుస్తులు ఉత్తమం. అయ్యప్ప స్వామి దర్శనానికి నలుపు ధరించాలి. ఫలితంగా దైవానుగ్రహం లభిస్తుంది’ అని అంటున్నారు.