News October 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News October 9, 2025

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నేపథ్యం ఇదే

image

TG: నవీన్ యాదవ్ 1983లో జన్మించారు. తండ్రి పేరు చిన శ్రీశైలం యాదవ్. నవీన్ 2014లో MIM, 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరి అజాహరుద్దీన్‌కు మద్దతు ప్రకటించారు. నవ యువ ఫౌండేషన్ స్థాపించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుట్టు మిషన్ల పంపిణీ, సామూహిక వివాహాలు, జాబ్ మేళాలు వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. స్థానికంగా ఈయనకు మంచి పట్టు ఉంది.

News October 9, 2025

పెళ్లికాని అమ్మాయిలు నేడు ఉయ్యాల ఊగితే?

image

నేడు అట్లతద్ది. ఈ శుభదినాన పెళ్లికాని అమ్మాయిలు ఆనందంతో ఉయ్యాల ఊగితే సుగుణాలు గల వ్యక్తి భర్తగా వస్తాడని పండితులు చెబుతున్నారు. యుక్త వయస్సు గల ఆడపిల్లలు నేడు ఆటపాటలతో ఆనందంగా గడిపితే గౌరీదేవికి సేవ చేసినట్లేనని పురాణాలు చెబుతున్నాయి. ఫలితంగా అమ్మవారి అనుగ్రహం లభించి కోరుకున్న వరుడు సొంతమవుతాడని నమ్మకం.
✍️ ప్రతిరోజు ఆసక్తికర ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 9, 2025

నేడే అట్ల తద్ది.. ఏం చేయాలంటే?

image

ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొనే అట్ల తద్దికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది గౌరీదేవిని పూజించే వ్రతం. మాంగల్య సౌభాగ్యం, కుటుంబ సుఖశాంతులను కోరి నేడు గౌరీదేవిని పూజిస్తారు. చంద్రోదయ వేళలో ఉమాదేవి వ్రతం నిర్వహిస్తారు. దీనివల్ల ఆదర్శ దాంపత్యానికి ప్రతీకలైన శివపార్వతుల అనుగ్రహం, గౌరీ దేవి కరుణ లభిస్తుందని పండితులు చెబుతున్నారు. స్త్రీలు తప్పక ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించాలని సూచిస్తున్నారు.