News October 9, 2025

అక్టోబర్ 9: చరిత్రలో ఈ రోజు

image

1945: భారతీయ సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్ జననం
1962: గాయని SP శైలజ జననం
1967: గెరిల్లా నాయకుడు, క్యూబా విప్లవకారుడు చే గువేరా(ఫొటోలో) మరణం
1974: దర్శకుడు వివి వినాయక్ జననం
2013: నటుడు శ్రీహరి మరణం
✦ ప్రపంచ తపాలా దినోత్సవం
✦ ప్రపంచ కంటిచూపు దినోత్సవం

Similar News

News October 9, 2025

నేడే అట్ల తద్ది.. ఏం చేయాలంటే?

image

ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొనే అట్ల తద్దికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది గౌరీదేవిని పూజించే వ్రతం. మాంగల్య సౌభాగ్యం, కుటుంబ సుఖశాంతులను కోరి నేడు గౌరీదేవిని పూజిస్తారు. చంద్రోదయ వేళలో ఉమాదేవి వ్రతం నిర్వహిస్తారు. దీనివల్ల ఆదర్శ దాంపత్యానికి ప్రతీకలైన శివపార్వతుల అనుగ్రహం, గౌరీ దేవి కరుణ లభిస్తుందని పండితులు చెబుతున్నారు. స్త్రీలు తప్పక ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించాలని సూచిస్తున్నారు.

News October 9, 2025

అట్ల తద్ది: గౌరీదేవి పూజా విధానం

image

అట్ల తద్ది రోజున గౌరీదేవికి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. ఈ పూజలో భాగంగా.. పీఠంపై బియ్యం పోయాలి. దానిపై తమలపాకులు ఉంచి, పసుపుతో చేసిన గౌరీదేవిని ప్రతిష్ఠించాలి. పసుపు, కుంకుమ, పూలు, గంధం ఉపయోగించి, అమ్మవారికి అర్చన చేయాలి. అట్లు, ఇతర నైవేద్యాలను సమర్పించాలి. ముగ్గురు/ఐదుగురు ముత్తైదువులకు వాయినం ఇచ్చి, ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేస్తే.. గౌరీదేవి అనుగ్రహంతో స్త్రీలకు సర్వసుఖాలు కలుగుతాయని ప్రతీతి.

News October 9, 2025

NCLలో 100 పోస్టులు

image

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ 100 పారామెడికల్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ అప్రెంటిస్‌లకు నెలకు రూ. 13,700, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ,12,700 స్టైఫండ్ ఇస్తారు. వెబ్‌సైట్: https://www.nclcil.in/