News October 9, 2025

రాబోయే 2-3 గంటల్లో వర్షాలు

image

TG: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని IMD HYD కేంద్రం వెల్లడించింది. జగిత్యాల, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

Similar News

News October 9, 2025

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్

image

TG: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. మొదటి విడతలో 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. నేటి నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. రోజూ ఉ.10.30 నుంచి సా.5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 13న రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.

News October 9, 2025

GREAT: 969 కిలోల గుమ్మడికాయను పండించాడు

image

మన దగ్గర పండించే గుమ్మడికాయలు సాధారణంగా 3-5KGల బరువు ఉంటాయి. ఇంకా జాగ్రత్తగా పెంచితే 10-20KGల వరకు బరువు పెరగొచ్చు. రష్యాకు చెందిన అలెగ్జాండర్ చుసోవ్ అనే రైతు ఏకంగా 969 కిలోల అతిపెద్ద గుమ్మడికాయను పండించి రికార్డు సృష్టించారు. ఆరు నెలల పాటు శ్రమించి.. నేల, గాలిని వేడిచేసే ప్రత్యేక గ్రీన్ హౌస్‌ను నిర్మించి.. ఎరువులు, నీటిని కచ్చితమైన మోతాదులో అందించి ఈ గుమ్మడిని పండించినట్లు రైతు చుసోవ్ తెలిపారు.

News October 9, 2025

AP న్యూస్

image

☛ రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు రూ.1000 కోట్లు మంజూరు.. జిల్లా రోడ్లకు రూ.600 కోట్లు, రాష్ట్ర రోడ్లకు రూ.400 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
☛ అమరావతిలో రూ.104కోట్లతో క్వాంటమ్ హబ్ భవన నిర్మాణానికి CRDA గ్రీన్ సిగ్నల్
☛ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 15 నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె.. 15న చలో విజయవాడ
☛ 2 రోజుల్లో రాష్ట్రంలోని బాణసంచా పరిశ్రమల్లో తనిఖీలు: హోంమంత్రి అనిత