News October 9, 2025
జగిత్యాల: పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలి: అడిషనల్ కలెక్టర్

జగిత్యాల పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి, కేసుల సంఖ్య తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గత నెలలో జరిగిన నేరాలపై బుధవారం చర్చించారు. పెండింగ్ కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్‌ఓపీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులను ఛేదించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, ఎన్నికల నియమావళిపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు.
Similar News
News October 9, 2025
ఈ నెల 13 నుంచి స్కూళ్లకు కొత్త టీచర్లు

AP: మెగా DSCలో ఎంపికైన టీచర్లు ఈ నెల 13న స్కూళ్లలో చేరనున్నారు. పోస్టింగ్‌ల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు 9, 10 తేదీల్లో అవకాశం ఇచ్చారు. ఆప్షన్ల నమోదు అనంతరం 11 లేదా 12వ తేదీన స్కూళ్ల కేటాయింపు పత్రాలను అందజేస్తారు. 16,347 పోస్టులకు మెగా DSC నిర్వహించగా, 15,941 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. రిజర్వేషన్ అభ్యర్థులు లేకపోవడంతో కొన్ని పోస్టులు మిగిలాయి. కాగా కొత్త టీచర్లకు ఇప్పటికే ట్రైనింగ్ పూర్తయింది.
News October 9, 2025
కాకినాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన హెలికాప్టర్‌లో కాకినాడ చేరుకుంటారు. కలెక్టరేట్‌లో మత్స్యకార సంఘాలు, కమిటీ ప్రతినిధులతో కాలుష్యం, నష్టపరిహారం చెల్లింపు అంశాలపై సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉప్పాడ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళతారు.
News October 9, 2025
స్థానిక సమరం.. వికారాబాద్ రెడీ

స్థానిక సంస్థల ఎన్నికలకు వికారాబాద్ జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు బుధవారం అభ్యంతరం చెప్పకపోవడంతో నేడు MPTC/ZPTC నోటిఫికేషన్ విడుదల కానుంది. వికారాబాద్ జిల్లాలో 227 ఎంపీటీసీ, 20 ఎంపీపీ, 20 జడ్పీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా 594 గ్రామ పంచాయతీలు, 5058 వార్డులున్నాయి. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది.