News October 9, 2025
జూబ్లీ ఫైట్‌లో నవీన్.. ప్రస్థానం ఇదే!

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ను AICC అధికారికంగా ప్రకటించింది. జూబ్లీహిల్స్ స్థానానికి 2014లో MIM అభ్యర్థిగా పోటీచేసిన నవీన్‌యాదవ్ 41,656 ఓట్లతో 2వస్థానంలో నిలిచారు. 2018లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయగా 18,817 ఓట్లు పడ్డాయి. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు టికెట్ ఇస్తేనే ఇక్కడ పార్టీ గెలుస్తుందనేంతలా క్యాడర్‌ను ప్రభావితం చేశారు. ప్రస్తుతం ఆయనను ప్రకటించగా పార్టీలో హర్షం నెలకొంది.
Similar News
News October 9, 2025
MPTC/ZPTC పోరు.. నేడు తొలి విడత నోటిఫికేషన్

యాదాద్రి జిల్లాలో జరగనున్న MPTC/ZPTC ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ గురువారం ఖరారు కానుందని కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. తొలి విడతలో 10 ZPTC, 84 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అడ్డగూడూరు, మోత్కూరు, ఆలేరు, ఆత్మకూరు, బొమ్మలరామారం, గుండాల, మోటకొండూరు, రాజంపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. మిగతా మండలాలకు 2వ విడతలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
News October 9, 2025
శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాల దర్శనానికి PM

ఈ నెల 16న ప్రధాని మోదీ కర్నూలు పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు, సీఎస్, డీజీపీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాని శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకుంటారని సీఎం తెలిపారు. అనంతరం ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ప్రధాని టూర్‌ను సక్సెస్ చేయాలని సూచించారు.
News October 9, 2025
వేములవాడ: యువకుడిపై కత్తితో దాడి..!

రాజన్న సిరిసిల్ల(D) వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ సమీపంలో ఉన్న గౌతమ్ మోడల్ స్కూల్ వద్ద అర్ధరాత్రి ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడిచేసి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.