News October 9, 2025
సీజేఐపై దాడి.. అడ్వొకేట్ రాకేశ్‌పై FIR నమోదు

సీజేఐ BR గవాయ్‌పై ఈ నెల 6న షూ విసిరి దాడికి పాల్పడిన అడ్వొకేట్ <<17935118>>రాకేశ్ కిషోర్‌పై<<>> బెంగళూరులో జీరో FIR నమోదయింది. ఆల్ ఇండియా అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భక్తవత్సల ఫిర్యాదుతో విధానసౌధ పోలీసులు BNS 132, 133 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాకేశ్ శిక్షార్హుడని, వెంటనే చర్యలు తీసుకోవాలని అడ్వొకేట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ కేసును పోలీసులు ఢిల్లీలోని తిలక్ మార్గ్ పీఎస్‌కు బదిలీ చేశారు.
Similar News
News October 9, 2025
థైరాయిడ్‌తో గుండెకు ముప్పు

శరీరానికి అవసరమైన థైరాయిడ్ హార్మోన్‌ను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. ఇది తక్కువైనా, ఎక్కువైనా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. హార్వర్డ్ యూనివర్సిటీ కథనం ప్రకారం థైరాయిడ్‌తో గుండెసమస్యల ముప్పు పెరుగుతుంది. హైపోథైరాయిడిజమ్ వల్ల గుండె కొట్టుకునే వేగం, రక్తనాళాలు సాగే లక్షణం తగ్గుతుంది. హైపర్ థైరాయిడిజమ్‌తో గుండె వేగంగా కొట్టుకుంటుంది. తద్వారా గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ అవుతుంది.
News October 9, 2025
నేడు భారీ వర్షాలు

ద్రోణి ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, TPTYలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. TGలో ఉ.8.30లోపు NLG, నాగర్ కర్నూల్, వనపర్తి, RRలో భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది.
News October 9, 2025
BELలో 30 ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)30 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు OCT 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ITI, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590, SC, ST, PWDలకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/