News October 9, 2025

సిద్దిపేట: 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు: మంత్రి

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వం తరుపున మా వాదనలు బలంగా వినిపించామన్నారు. దేశంలో తొలి రాష్ట్రంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నామని, సభలో మాట్లాడినప్పుడు అన్ని పార్టీల వారు స్పష్టంగా మద్దతు ఇచ్చినట్లు తెలిపారు.

Similar News

News October 9, 2025

వనపర్తి: BE READY.. మరి కాసేపట్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..!

image

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలి విడత జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు మరి కాసేపట్లో రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీల వారీగా ఓటరు జాబితాను ప్రదర్శిస్తారు. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి 5PM వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

News October 9, 2025

నెల్లూరు: నగదు ఇవ్వలేదని ఇద్దరిని చంపేశారు!

image

నెల్లూరులో జంట హత్యలు సంచలనం సృష్టించాయి. నెల్లూరుకు చెందిన పాత నేరస్తులు సాయిశంకర్, మనోజ్ మద్యం తాగి జాఫర్ సాహెబ్ కాలువ వద్దకు వెళ్లారు. అటుగా వస్తున్న YSR కడప జిల్లాకు చెందిన శివను అడ్డుకుని నగదు అడగగా లేవని చెప్పడంతో దాడి చేసి చంపారు. పెన్నా సమీపంలో ఉంటున్న పోలయ్య అటుగా వెళ్తుండగా అడ్డుకుని డబ్బులు డిమాండ్ చేయగా లేవని చెప్పడంతో హత్యచేశారు. గంటల వ్యవధిలోనే నిందితులును పోలీసులు అరెస్ట్ చేశారు.

News October 9, 2025

వరంగల్: ఆన్ లైన్ స్నేహలతో జర భద్రం

image

ఆన్ లైన్ స్నేహలతో జర భద్రమని వరంగల్ సైబర్ పోలీసులు తెలిపారు. అందరిని నమ్మొద్దని, ఆన్ లైన్ పరిచయాలతో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చాటింగ్, ప్రొఫైల్ ఫోటో చూసి నమ్మొద్దన్నారు. తెలియని వారికి మీ ఫోటోలు పంపించవద్దని, పిల్లలకు ఆన్లైన్ మోసాలపై అవగాహనా కల్పించాలని సైబర్ పోలీసులు పేర్కొన్నారు.