News October 9, 2025

మహేశ్-రాజమౌళి సినిమా పేరు ‘వారణాసి’?

image

మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నవంబర్ 16న టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Similar News

News October 9, 2025

IGMCRI 226 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు NOV 6వరకు అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 -35ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250, SC, STలకు రూ.125. వెబ్‌సైట్: https://igmcri.edu.in/

News October 9, 2025

దీపావళి ఏ రోజు జరుపుకోవాలంటే?

image

అక్టోబర్ 20, 21 తేదీల్లో అమావాస్య తిథి ఉండటంతో.. ఈ ఏడాది దీపావళి ఏ రోజు జరుపుకోవాలన్న గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పండితుల సంస్థ ‘కాశీ విద్వత్ పరిషత్’ దీనిపై క్లారిటీ ఇచ్చింది. దీపావళి పండుగను అక్టోబర్ 20వ తేదీన జరుపుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి ప్రదోషకాలం (5.46 PM-8.18 PM)ఆరోజు ఉంటుందని వెల్లడించింది. లక్ష్మీపూజ కూడా అదే రోజు రా.7.08-రా.8.18 మధ్య జరుపుకోవచ్చని తెలిపింది.

News October 9, 2025

లక్షల కోట్లు బూడిద చేశాడు

image

US కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ పాలిసేడ్స్‌లో చెలరేగిన కార్చిచ్చు ఉద్దేశపూర్వకంగా సృష్టించిందని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో 29 ఏళ్ల జొనాథన్ రిండర్‌నెక్ట్‌ను అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 1న అతను పెట్టిన మంట లాస్ ఏంజెలిస్ చరిత్రలోనే భారీ అగ్నిప్రమాదంగా మారింది. ఈ మంటలకు 12 మంది ప్రాణాలు కోల్పోగా, 6,800 కట్టడాలు బూడిదయ్యాయి. దాదాపు 150 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.