News October 9, 2025

మహబూబ్‌నగర్: యువ జంట సూసైడ్

image

భూత్పూర్ మం. కొత్తూరులో యువ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం వెలుగు చూసింది. కొత్తూరుకు చెందిన రమేశ్(28)కు జూన్‌లో గోపాల్పేట మం. చీర్కేపల్లి వాసి నిర్మల(22)తో వివాహమైంది. అన్యోన్యంగా ఉంటున్న దంపతులు.. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. నిర్మల నేలపై పడి ఉండగా.. రమేశ్ తాడుకు వేలాడుతూ కనిపించాడు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 9, 2025

సూర్యాపేట: మహిళను బెదిరించిన ఐదుగురు అరెస్టు

image

పాత కక్షల నేపథ్యంలో ఓ మహిళను చంపుతామని బెదిరించిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న ఎర్కారం గ్రామానికి చెందిన సైదమ్మ ఇంటి ముందు ఉండగా, కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు తల్వార్ తిప్పుతూ ఆమెను బెదిరించారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

News October 9, 2025

కరీంనగర్: CRPF జవాన్ ఆత్మహత్య..!

image

కరీంనగర్(D) హుజూరాబాద్ మం. కాట్రపల్లికి చెందిన పెరమండ్ల రాజ్ కుమార్(38) CRPFలో ఉద్యోగం చేస్తున్నారు. దసరా సెలవుల సందర్భంగా గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో బుధవారం నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. కాగా, ఘటన జరిగిన సమయంలో భార్య పుట్టింట్లో ఉంది. మృతుడి తండ్రి భిక్షపతి PSలో ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 9, 2025

MHBD: నేటి నుంచి ఎన్నికల నామినేషన్లు

image

మహబూబాబాద్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల వివరాలు ఇలా ఉన్నాయి. బయ్యారం, చిన్న గూడూరు, దంతాలపల్లి, గార్ల, గూడూరు, మహబూబాబాద్, నరసింహాలపేట, పెద్ద వంగర, తొర్రూరు, మండలాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి అధికారులు MPDO కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది.