News October 9, 2025
VZM: జిల్లాలో నేడు ఫుడ్ కమిషన్ ఛైర్మన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ ఛైర్మెన్ సిహెచ్.విజయ ప్రతాప్ రెడ్డి విజయనగరం జిల్లాలో గురువారం పర్యటించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి జి.మురళీనాథ్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఛైర్పర్సన్ జిల్లాకు వస్తారని, ముందుగా బొబ్బిలిలో క్షేత్రస్థాయిలో పర్యటించి, అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
Similar News
News October 9, 2025
VZM: విదేశాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత విద్యా అవకాశాలు కల్పిస్తున్నట్లు విజయనగరం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఖతార్లో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలకు అక్టోబర్ 13 వరకు, జర్మనీలో ఫిజియోథెరపీ, ఓటీ టెక్నీషియన్ ఉద్యోగాలకు అక్టోబర్ 15 వరకు, రష్యాలో మెటలర్జీ కోర్సుకు అక్టోబర్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు naipunyam.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
News October 9, 2025
పైడితల్లమ్మ ఆలయ అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు గురువారం శ్రీకారం చుట్టనున్నారు. ఆలయం వద్ద ఉదయం 8.30 గంటలకు మాన్సాస్ ఛైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు శంకుస్థాపన చేస్తారు. ఆయనతో పాటు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇతర పెద్దలు పాల్గొంటారని అధికారులు వెల్లడించారు.
News October 9, 2025
జిల్లా వ్యాప్తంగా నీటి నమూనా పరీక్షలు చేయండి: VZM కలెక్టర్

వర్షాకాలంలో నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం సూచించారు. కలుషిత నీటిని మరిగించి తాగడం, భోజనం ముందు చేతులు కడగడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యలు పాటించాలన్నారు. ఎవరైనా వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు గమనిస్తే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నీటి నమూనా పరీక్షలు చేపట్టాలన్నారు.