News October 9, 2025

NGKL: రెండో విడతలో 10 జడ్పీటీసీ, 99 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో రెండో విడతలో 10 జడ్పీటీసీ, 99 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో అచ్చంపేట, అమ్రాబాద్, పదర, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల జడ్పీటీసీలతోపాటు మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు.

Similar News

News October 9, 2025

నెల్లూరు జిల్లాలో విస్తరిస్తున్న గంజాయి వ్యాపారం!

image

నెల్లూరు జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల వ్యాపారం ఆగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ బృందం ఉన్నప్పటికీ పరిస్థితి యథాతథంగా ఉంది. యువత, విద్యార్థులే ప్రధాన లక్ష్యంగా మారి గంజాయి వ్యాపారం విస్తరిస్తోంది. విశాఖ నుంచి దిగుమతి చేసే గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి కళాశాలలు, బస్టాండ్లు, థియేటర్లు, కేఫేల్లో విక్రయిస్తున్నారు. మొదట ఉచితంగా ఇచ్చి తర్వాత అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

News October 9, 2025

కర్లపాలెంలో ఉదయాన్నే మందు బాబుల విన్యాసాలు

image

కర్లపాలెంలో సమయపాలన లేకుండా వైన్ షాపులు నిర్వహించడంతో వేకువజామునంచే మద్యం బాబులు రహదారులపై దర్శనమిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మద్యం షాపులు నిర్వహించడంతో మద్యం బాబులు మద్యం మత్తులో రహదారులపై పడిపోతూ వాహనదారులకు, పాదాచారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి వైన్ షాపులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News October 9, 2025

సంగారెడ్డి: నామినేషన్ వేద్దామా.. వేచి చూద్దామా?

image

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రిజర్వేషన్లు ప్రకటించింది. ప్రభత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్ట్ మెట్లు ఎక్కగా, కోర్టు కేసును గురువారం మధ్యాహ్నం 2:15కు వాయిదా వేసింది. కొత్త రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా అనే డైలమాలో ఆశావహులున్నారు. సంగారెడ్డి జిల్లాలో NKD, ZHB డివిజన్‌లో నేడు నామినేషన్ వేద్దామా, వేచిచూదమా? అనే సందిగ్ధంలో అభ్యర్థులు ఉన్నారు.