News October 9, 2025
బిలియనీర్ల క్లబ్‌లోకి క్రిస్టియానో రొనాల్డో

బిలియనీర్ అయిన తొలి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పోర్చుగల్ స్టార్ రొనాల్డో నిలిచారు. ఆయన సంపద $1.4bn(₹12,352.08Cr) అని బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసింది. 2002-2023 మధ్య మ్యాచుల ద్వారా $550M+(₹4,869.57Cr), నైక్ (₹159.25Cr), అర్మానీ, కాస్ట్రోల్ బ్రాండ్లు, ఇతర ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ₹1,554Crకు పైగా ఆర్జించినట్లు పేర్కొంది. సౌదీ క్లబ్ అల్-నాస్ర్‌తో 2023లో $200M, తాజాగా $400Mలకు ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది.
Similar News
News October 9, 2025
లక్ష్మీదేవి పద్మం పైనే ఎందుకుంటుంది?

లక్ష్మీదేవిని పద్మంపై ఆసీనురాలిగా చూపడం వెనుక ఆధ్యాత్మిక సందేశం ఉంది. తామరపువ్వు నీటిలో అటూ ఇటూ కదులుతూ, ఊగుతూ ఉంటుంది. ఆ తామర మాదిరిగానే సంపద కూడా చంచలమైనది. అంటే నిలకడ లేనిదని అర్థం. లక్ష్మీదేవి కమలంపై కొలువై ధనం అశాశ్వత స్వభావాన్ని మానవులకు నిరంతరం గుర్తుచేస్తుంది. సంపద శాశ్వతం కాదని, మనిషి గర్వం లేకుండా ఉండాలని ఈ దైవిక రూపం మనకు బోధిస్తుంది. <<-se>>#DHARMASANDEHALU<<>>
News October 9, 2025
20 మంది చిన్నారుల మృతి.. ‘శ్రేసన్’ ఓనర్ అరెస్ట్

దగ్గు <<17954495>>మందు<<>> అంటేనే భయపడేలా కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తయారు చేసిన శ్రేసన్ కంపెనీ(తమిళనాడు) ఓనర్ రంగనాథన్‌ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారుల మరణాలతో ఈ నెల 1, 2 తేదీల్లో అధికారులు చేసిన తనిఖీల్లో గ్యాస్ స్టవ్‌లపై రసాయనాలు వేడి చేయడం, తుప్పు పట్టిన పరికరాలు గుర్తించారు. అనుభవం లేని సిబ్బంది, గ్లౌజులు, మాస్కులు లేకుండా పనిచేస్తున్నట్లు గమనించారు. అనంతరం కంపెనీని సీజ్ చేశారు.
News October 9, 2025
జగన్ పర్యటన వేళ పోలీసుల సూచనలు

AP: మాజీ సీఎం జగన్ ‘చలో నర్సీపట్నం’ పర్యటన నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సూచనలు చేశారు. నిర్వాహకులు కచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. హైవేలు, కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా జన సమీకరణ చేయకూడదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకైనా నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మెడికల్ కాలేజీ ప్రాంగణంలోనూ సామర్థ్యానికి మించి జనాలను సమీకరించకూడదని పేర్కొన్నారు.