News October 9, 2025
ప్రసారభారతిలో 59 ఉద్యోగాలు

ప్రసారభారతి 59పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. యాంకర్ కమ్ కరస్పాండెంట్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్, కాపీ రైటర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, జర్నలిజం, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/
Similar News
News October 9, 2025
కరీనాకపూర్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

బాలీవుడ్ నటి కరీనాకపూర్ ఏజ్ పెరిగేకొద్దీ యంగ్‌గా, ఫిట్‌గా కనిపిస్తున్నారు. ఇద్దరుపిల్లల తల్లైనా ఫిట్‌గా ఉండటానికి కారణం హెల్తీ లైఫ్‌స్టైలేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె. రోజూ సాయంత్రం 6 లోపు డిన్నర్ చేసి 9.30కి నిద్రపోతానని తెలిపారు. నైట్ పార్టీలకు దూరంగా ఉంటానని, రెగ్యులర్ వర్కవుట్స్, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తానని పేర్కొన్నారు. పరాఠా, కిచిడీ ఇష్టమైన ఫుడ్స్ అని తెలిపారు.<<-se>>#celebrity<<>>
News October 9, 2025
జీవ ఎరువుల వాడకంతో కలిగే ప్రయోజనాలు

పంటకు <<17939337>>జీవ ఎరువు<<>>లను అందించడం వల్ల హార్మోన్లు, విటమిన్లు మొక్కకు లభ్యమై అవి ఆరోగ్యకరంగా, వేగంగా పెరుగుతాయి. నేల నుంచి సంక్రమించే తెగుళ్లను కొంతమేర అరికట్టవచ్చు. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడి భూసారం పెరుగుతుంది. రసాయన ఎరువుల వాడకం 20 నుంచి 25 శాతం మేర తగ్గించుకోవచ్చు. జీవ ఎరువుల వల్ల పంట సాధారణ దిగుబడి 10 నుంచి 20 శాతం వరకు పెరుగుతుంది. వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.
News October 9, 2025
గ్యాస్ సిలిండర్ ఎక్స్‌పైరీ తేదీని చెక్ చేయండిలా!

ఇంట్లో నెలల తరబడి గ్యాస్ సిలిండర్ ఉంచుతున్నారా? ఇది ప్రమాదమే. ఎందుకంటే వాటికీ ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. సురక్షితమైన వాడకం కోసం దీనిని నిర్ణయించారు. దీనిని సిలిండర్ పైభాగంలో ముద్రిస్తారు. ఉదా.. ‘C-27’ అని ఉంటే 2027లో JUL- SEP మధ్య ముగుస్తుందని అర్థం. A అని ఉంటే JAN TO MAR, B- APR TO JUN, C-JULY TO SEP, D- OCT TO DEC అని తెలుసుకోవాలి. గడువైపోయిన వాటిని వాడకుండా ఉంటే ప్రమాదాలు జరగవు. SHARE IT