News October 9, 2025
కనుపూరు కాలువలో పడి చార్టెడ్ అకౌంటెంట్ మృతి

వెంకటాచల మండలం కసుమూరు కాలువలో పడి అల్లూరు శ్రీకాంత్(30) మృతి చెందినట్లు బుధవారం రాత్రి పోలీసులు తెలిపారు. విడవలూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్ కసుమూరులో అత్తగారింటికి భార్య శిరీషతో కలిసి వచ్చాడు. బహిర్భూమికి పోయి ప్రమాదవశాత్తు కనుపూరు కాలువలో పడి చనిపోయాడు. ఇతను CAగా చెన్నైలో పనిచేస్తున్నాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 9, 2025
నాయుడుపేటలో ట్రైన్ కింద పడి ఇంటర్ విద్యార్థి మృతి

నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్ చదువుతున్న సంతోష్(17) ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడి మృతి చెందాడు. వరదయ్యపాలెంకు చెందిన సంతోష్ వెంకటాచలం వద్ద ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. దసరా సెలవులు ముగించుకొని తడ నుంచి వెంకటాచలానికి ఫ్రెండ్స్‌తో ట్రైన్‌లో బయలుదేరాడు. నాయుడుపేట వద్దకి వచ్చేసరికి అదుపుతప్పి ట్రైన్ కిందపడి మృతి చెందాడు.
News October 9, 2025
నెల్లూరు జిల్లాలో విస్తరిస్తున్న గంజాయి వ్యాపారం!

నెల్లూరు జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల వ్యాపారం ఆగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ బృందం ఉన్నప్పటికీ పరిస్థితి యథాతథంగా ఉంది. యువత, విద్యార్థులే ప్రధాన లక్ష్యంగా మారి గంజాయి వ్యాపారం విస్తరిస్తోంది. విశాఖ నుంచి దిగుమతి చేసే గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి కళాశాలలు, బస్టాండ్లు, థియేటర్లు, కేఫేల్లో విక్రయిస్తున్నారు. మొదట ఉచితంగా ఇచ్చి తర్వాత అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
News October 9, 2025
నెల్లూరు: నగదు ఇవ్వలేదని ఇద్దరిని చంపేశారు!

నెల్లూరులో జంట హత్యలు సంచలనం సృష్టించాయి. నెల్లూరుకు చెందిన పాత నేరస్తులు సాయిశంకర్, మనోజ్ మద్యం తాగి జాఫర్ సాహెబ్ కాలువ వద్దకు వెళ్లారు. అటుగా వస్తున్న YSR కడప జిల్లాకు చెందిన శివను అడ్డుకుని నగదు అడగగా లేవని చెప్పడంతో దాడి చేసి చంపారు. పెన్నా సమీపంలో ఉంటున్న పోలయ్య అటుగా వెళ్తుండగా అడ్డుకుని డబ్బులు డిమాండ్ చేయగా లేవని చెప్పడంతో హత్యచేశారు. గంటల వ్యవధిలోనే నిందితులును పోలీసులు అరెస్ట్ చేశారు.