News October 9, 2025
GREAT: 969 కిలోల గుమ్మడికాయను పండించాడు

మన దగ్గర పండించే గుమ్మడికాయలు సాధారణంగా 3-5KGల బరువు ఉంటాయి. ఇంకా జాగ్రత్తగా పెంచితే 10-20KGల వరకు బరువు పెరగొచ్చు. రష్యాకు చెందిన అలెగ్జాండర్ చుసోవ్ అనే రైతు ఏకంగా 969 కిలోల అతిపెద్ద గుమ్మడికాయను పండించి రికార్డు సృష్టించారు. ఆరు నెలల పాటు శ్రమించి.. నేల, గాలిని వేడిచేసే ప్రత్యేక గ్రీన్ హౌస్‌ను నిర్మించి.. ఎరువులు, నీటిని కచ్చితమైన మోతాదులో అందించి ఈ గుమ్మడిని పండించినట్లు రైతు చుసోవ్ తెలిపారు.
Similar News
News October 9, 2025
SBIలో మేనేజర్ ఉద్యోగాలు

SBI 7 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA, PGDM, PGDBM, CFA/FRM/CA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు గరిష్ఠ వయసు 45ఏళ్లుకాగా, మేనేజర్ పోస్టుకు 36ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/
News October 9, 2025
నిరుద్యోగులకు శుభవార్త.. గరిష్ఠ వయోపరిమితి పెంపు

AP: నాన్ యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం 34 నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిఫామ్ పోస్టులకు మాత్రం రెండేళ్లు పొడిగించింది. 2026, సెప్టెంబర్ 30 వరకు ఈ వయో సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక నుంచి APPSC, ఇతర రిక్రూట్‌మెంట్ సంస్థల ద్వారా చేపట్టే నియామకాల్లో ఈ వయోపరిమితి అమలవుతుందని తెలిపింది.
News October 9, 2025
ఏడు కొండలు ఏడు శక్తి కేంద్రాలు – వేంకటాద్రి

సాధన చేసే వ్యక్తి ఇక్కడ ధ్యానం చేస్తే.. అతని కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని చేరుతుంది. అప్పుడు, అంతకుముందు 6 కొండలపై జరిపిన సాధన 6 చెడు గుణాలను (కామ, కోపం, దురాశ, పక్షపాతం, గర్వం, అసూయ) తొలగిస్తుంది. శ్రీకృష్ణుడు కాళీయ సర్పం తలపై నృత్యం చేసినట్లుగా.. ఈ చెడు గుణాలు తొలగిపోతాయి. ఈ దశలో సాధకుడికి, దేవుడికి మధ్య ఎలాంటి అడ్డు ఉండదు. ఈ అత్యున్నత స్థితిని చేరుకునే కొండనే వేంకటాద్రి అంటారు.<<-se>>#VINAROBHAGYAMU<<>>