News October 9, 2025
విజయవాడ బస్టాండ్ థియేటర్లో బొమ్మ పడుతుందా!

విజయవాడ PNBS బస్టాండ్‌లో 2 మినీ థియేటర్లు, దుకాణాల టెండర్లకు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. 35 షాపుల్లో 19కి మాత్రమే 50 మంది వేలంలో పాల్గొన్నారు. 6 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలనడం, ఇతర నిబంధనలతో వ్యాపారులు మందుకు రావట్లేదని తెలుస్తోంది. 2 థియేటర్ల లీజుకు ఇద్దరే ముందుకు రాగా.. రూ.3-4 లక్షల లీజు వస్తే ఇచ్చేందుకు అధికారులు చూస్తున్నారు. కాగా గతంలో ప్రయాణికుల్ని అలరించిన ఈ థియేటర్లు నిరుపయోగంగా మారాయి.
Similar News
News October 9, 2025
ANU కొత్త వైస్ ఛాన్సలర్ నేపథ్యం ఇదే..!

ANU కొత్త వైస్ ఛాన్సలర్‌గా సత్యనారాయణ రాజు నియామకమైన విషయం తెలిసిందే. ఈయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెరుగైన పరిశోధనలు చేస్తూ పలు అవార్డులను అందుకున్నారు. 2017లో ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అవార్డును, మహిమ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును, ఉత్తమ AN అవార్డును, 2018లో డాక్టర్ ఆనంద్ ప్రకాష్ అవార్డును, ఎమినెంట్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు.
News October 9, 2025
గుంటూరు: అక్రమాల అడ్డుకట్టకు టాస్క్ ఫోర్స్

గుంటూరు జిల్లాలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు SP వకుల్ జిందాల్ ప్రత్యేక టాక్స్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. గంజాయి, పేకాటలపై ప్రత్యేక నిఘా కోసం గతంలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వంటి వర్గాల్లో అత్యధిక కాలం పని చేసి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో అనుభవం ఉన్న సిబ్బందితో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో సబ్ డివిజన్‌కు ఒకరు లేదా ఇద్దరు చొప్పున సిబ్బందిని నియమించారు
News October 9, 2025
విజయవాడలో నకలీ మద్యం విక్రయం..?

ములకలచెరువులో తయారైన నకిలీ మద్యాన్ని విజయవాడలోని పలు బార్లలో విక్రయించినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. నిందితుడు జనార్ధనరావు భాగస్వామ్యంతో వైన్స్ మేనేజర్ కల్యాణ్ ఈ దందా నడిపినట్లు తేలింది. బెంగళూరు నుంచి ముడిసరుకు తెప్పించి, 4 నెలలుగా ఈ దందా సాగుతోంది.