News October 9, 2025
చర్మ సంరక్షణలో కొల్లాజెన్ కీలకపాత్ర

శరీరాన్ని ఆరోగ్యంగా, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి కొల్లాజెన్ ప్రోటీన్ ముఖ్యం. వయసు పెరిగేకొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో కీళ్లనొప్పులు, ముడతలు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. జీర్ణవ్యవస్థపైనా ప్రభావం పడుతుంది. దీనికోసం డైట్‌లో చేపలు, సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీలు, గుడ్లు, ఆకుకూరలు, దాల్చినచెక్క, గ్రీన్‌టీ చేర్చుకోవాలని సూచిస్తున్నారు. <<-se>>#SkinCare<<>>
Similar News
News October 9, 2025
జాతీయ మహిళా కమిషన్ ఎందుకంటే?

సమాజంలో అతివల హక్కులను కాలరాయడం, వారి హక్కులపై జరిగే దాడి, అన్యాయాలను అరికట్టడానికి మహిళా కమిషన్ పనిచేస్తుంది. 1988లో నేషనల్ పర్‌స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్ సిఫార్సుల మేరకు 1990లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ ద్వారా జాతీయ మహిళా కమిషన్ (NCW)ను ఏర్పాటు చేశారు. 1992లో NCW చట్టబద్ధమైన సంస్థగా మారింది. కౌన్సెలింగ్ సేవలతోపాటు బాధితులకు రక్షణ, తక్షణ ఉపశమనం కల్పించడానికి దోహదపడుతుంది.
News October 9, 2025
లాభాలు తెచ్చిన బంతి సాగు.. రైతుల్లో ఆనందం

దసరా, దీపావళి సీజన్లను దృష్టిలో పెట్టుకొని బంతి సాగు చేసిన రైతులు ఆశించిన లాభాలు దక్కడంతో ఆనందంగా ఉన్నారు. తొలుత వర్షాల వల్ల పంటకు కొంత నష్టం వాటిల్లినా.. బతుకమ్మ, శరన్నవరాత్రి ఉత్సవాలు, దసరా, శుభకార్యాల వల్ల బంతి పూలకు డిమాండ్ పెరిగి రైతులకు మంచి ఆదాయం వచ్చింది. దసరా సీజన్ ముగిసిన నాటికి ఎకరాకు రూ.2లక్షల వరకూ లాభం వచ్చిందని, దీపావళికి ఇది మరింత పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News October 9, 2025
మంత్రులెవరూ HYDలో ఉండవద్దు: సీఎం రేవంత్

TG: స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మంత్రులు హైదరాబాద్‌కు పరిమితం కాకూడదని సీఎం రేవంత్ ఆదేశించారు. అందరూ క్షేత్రస్థాయిలో పనిచేయాలని జూమ్ సమావేశంలో సూచించారు. ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయొద్దన్నారు. రిజర్వేషన్లపై హైకోర్టు వాదనలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు.