News October 9, 2025
హిందూపురంలో మెగా జాబ్ మేళా

AP: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 10న హిందూపురంలోని SDGC ఎంబీఏ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సీడాప్, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తారు. 15 మల్టీ నేషనల్ కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. టెన్త్ నుంచి పీజీ వరకు చదువుకున్నవారు ముందుగా https://naipunyam.ap.gov.in/ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Similar News
News October 9, 2025
మంత్రులెవరూ HYDలో ఉండవద్దు: సీఎం రేవంత్

TG: స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మంత్రులు హైదరాబాద్‌కు పరిమితం కాకూడదని సీఎం రేవంత్ ఆదేశించారు. అందరూ క్షేత్రస్థాయిలో పనిచేయాలని జూమ్ సమావేశంలో సూచించారు. ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయొద్దన్నారు. రిజర్వేషన్లపై హైకోర్టు వాదనలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు.
News October 9, 2025
SBIలో మేనేజర్ ఉద్యోగాలు

SBI 7 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA, PGDM, PGDBM, CFA/FRM/CA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు గరిష్ఠ వయసు 45ఏళ్లుకాగా, మేనేజర్ పోస్టుకు 36ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/
News October 9, 2025
నిరుద్యోగులకు శుభవార్త.. గరిష్ఠ వయోపరిమితి పెంపు

AP: నాన్ యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం 34 నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిఫామ్ పోస్టులకు మాత్రం రెండేళ్లు పొడిగించింది. 2026, సెప్టెంబర్ 30 వరకు ఈ వయో సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక నుంచి APPSC, ఇతర రిక్రూట్‌మెంట్ సంస్థల ద్వారా చేపట్టే నియామకాల్లో ఈ వయోపరిమితి అమలవుతుందని తెలిపింది.