News October 9, 2025

స్థానిక సమరం.. వికారాబాద్ రెడీ

image

స్థానిక సంస్థల ఎన్నికలకు వికారాబాద్ జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు బుధవారం అభ్యంతరం చెప్పకపోవడంతో నేడు MPTC/ZPTC నోటిఫికేషన్ విడుదల కానుంది. వికారాబాద్ జిల్లాలో 227 ఎంపీటీసీ, 20 ఎంపీపీ, 20 జడ్పీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా 594 గ్రామ పంచాయతీలు, 5058 వార్డులున్నాయి. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది.

Similar News

News October 9, 2025

TRP ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా రమణ

image

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) సోషల్ మీడియా విభాగానికి కన్వీనర్లను నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా భద్రకాళి రమణను ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, రాష్ట్ర కన్వీనర్ ఆకుల మనోజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందన్నారు.

News October 9, 2025

అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులను వినియోగించుకోవాలి: కలెక్టర్

image

సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామ పరిధిలో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను జిల్లా కలెక్టర్ హైమావతి సందర్శించారు. విద్యార్థులకు అందించే శిక్షణ తరగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రిన్సిపల్ రామానుజ, టీచర్స్ అందరితో సమావేశం నిర్వహించారు. యువతకు ఉపాధి అందించేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించి కొత్త కోర్సులను తీసుకు వచ్చినట్లు తెలిపారు. యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News October 9, 2025

వరంగల్: మద్యం షాపుల వైపు రియల్టర్ల చూపు

image

మద్యం వ్యాపారంలోకి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రానున్నారా.? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం గణనీయంగా పడిపోయింది. భూములపై పెట్టుబడి పెట్టే వారు కూడా కరవయ్యారు. ఉమ్మడి WGL జిల్లాలో ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిచింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. డబ్బు ఉన్న వ్యక్తులు మద్యం వ్యాపారం వైపు చూస్తున్నారు.