News October 9, 2025
కాకినాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన హెలికాప్టర్‌లో కాకినాడ చేరుకుంటారు. కలెక్టరేట్‌లో మత్స్యకార సంఘాలు, కమిటీ ప్రతినిధులతో కాలుష్యం, నష్టపరిహారం చెల్లింపు అంశాలపై సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉప్పాడ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళతారు.
Similar News
News October 9, 2025
నర్సీపట్నం కాదు.. హైకోర్టుకు వెళ్లండి: TDP

AP: మాజీ CM జగన్ నర్సీపట్నం పర్యటనపై TDP సెటైర్లు వేసింది. నర్సీపట్నం కాకుండా హైకోర్టుకు వెళ్లి లాజిక్కులు చెప్పాలని సూచించింది. PPP మోడల్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసింది. ‘PPP మోడల్‌లో వైద్య కళాశాలలు నిర్మించే అంశంలో జోక్యం చేసుకోలేం. అలా నిర్మిస్తే తప్పేంటి? ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటే మంచిదే కదా’ అని కోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఉన్న వార్తను ట్వీట్ చేసింది.
News October 9, 2025
కాకినాడ: పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్.. ఫొటోలు వైరల్

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత అధికారిక కార్యక్రమంలో క్యాజువల్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా తెల్లటి దుస్తుల్లో కనిపించే పవన్ గురువారం కాకినాడ పర్యటన సందర్భంగా క్యాజువల్ దుస్తులు, గాగుల్స్ ధరించారు. రియల్ లైఫ్‌లోనూ స్టైలిష్‌గా ఉన్న ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
News October 9, 2025
వరంగల్: రూ.800 పెరిగిన వండర్ హట్ మిర్చి

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం తేజా మిర్చి(ఏసీ) క్వింటాకు రూ.14,700 ధర పలకగా.. ఈరోజు రూ.14,500కి తగ్గింది. 341 రకం మిర్చి(ఏసీ)కి నిన్న రూ.16,200 ధర వస్తే.. నేడు రూ.16,300 అయ్యింది. మరోవైపు వండర్ హాట్(WH) ఏసీ మిర్చికి బుధవారం రూ.16 వేలు ధర వస్తే.. గురువారం రూ.16,800 అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.