News October 9, 2025
ఇతిహాసాలు క్విజ్ – 30

1. అశోకవనంలో సీతాదేవికి అండగా ఉండి, ధైర్యం చెప్పిన రాక్షస స్త్రీ ఎవరు?
2. శ్రీకృష్ణుడి శంఖం పేరేంటి?
3. భాగవతం రాయమని వేద వ్యాసుడిని ప్రేరేపించింది ఎవరు?
4. సూర్యుడి వాహనం ఏది?
5. ఏకోన వింశతి: అంటే ఎంత?
✍️ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News October 9, 2025
నర్సీపట్నం కాదు.. హైకోర్టుకు వెళ్లండి: TDP

AP: మాజీ CM జగన్ నర్సీపట్నం పర్యటనపై TDP సెటైర్లు వేసింది. నర్సీపట్నం కాకుండా హైకోర్టుకు వెళ్లి లాజిక్కులు చెప్పాలని సూచించింది. PPP మోడల్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసింది. ‘PPP మోడల్‌లో వైద్య కళాశాలలు నిర్మించే అంశంలో జోక్యం చేసుకోలేం. అలా నిర్మిస్తే తప్పేంటి? ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటే మంచిదే కదా’ అని కోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఉన్న వార్తను ట్వీట్ చేసింది.
News October 9, 2025
ట్రాన్స్‌జెండర్ల వేధింపులపై ట్వీట్.. స్పందించిన CP సజ్జనార్

TG: పోలీసులు, నాయకుల మద్దతుతో HYDలో ట్రాన్స్‌జెండర్ల దందా తారస్థాయికి చేరిందని, రూ.వేలు డిమాండ్ చేస్తూ వేధిస్తున్నారని ఓ నెటిజన్ Xలో ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ CP సజ్జనార్‌ను కోరారు. ‘ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. దీనిని తీవ్రంగా పరిగణిస్తాం. వాస్తవాలను ధ్రువీకరించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని ఆయన తెలిపారు. మీకూ వీరి వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయా? COMMENT
News October 9, 2025
జాతీయ మహిళా కమిషన్ ఎందుకంటే?

సమాజంలో అతివల హక్కులను కాలరాయడం, వారి హక్కులపై జరిగే దాడి, అన్యాయాలను అరికట్టడానికి మహిళా కమిషన్ పనిచేస్తుంది. 1988లో నేషనల్ పర్‌స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్ సిఫార్సుల మేరకు 1990లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ ద్వారా జాతీయ మహిళా కమిషన్ (NCW)ను ఏర్పాటు చేశారు. 1992లో NCW చట్టబద్ధమైన సంస్థగా మారింది. కౌన్సెలింగ్ సేవలతోపాటు బాధితులకు రక్షణ, తక్షణ ఉపశమనం కల్పించడానికి దోహదపడుతుంది.